Jio vs Airtel Fiber plans: జియో , ఎయిర్‌టెల్ ఎయిర్ ఫైబర్ ప్లాన్స్ వివరాలు ఇవే

Jio vs Airtel Fiber plans: టెలీకం రంగంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ జియో ఇప్పుడు బ్రాడ్‌‌బ్యాండ్, వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో కూడా తనదైన ముద్ర వేస్తోంది. ఇందులో భాగంగా జియో కొత్తగా ఎయిర్‌ఫైబర్ సర్వీస్ ప్రారంభించింది. ఆ వివరాలు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 3, 2023, 02:53 PM IST
Jio vs Airtel Fiber plans: జియో , ఎయిర్‌టెల్ ఎయిర్ ఫైబర్ ప్లాన్స్ వివరాలు ఇవే

Jio vs Airtel Fiber plans: రిలయన్స్ జియో కొత్తగా ప్రారంభించిన ఎయిర్‌ఫైబర్ సర్వీస్ అనేది వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడుకున్నది.  ఇది 5జి డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. గణేశ్ చతుర్ది నాడు సెప్టెంబర్ 18న దేశంలో లాంచ్ అయిన ఎయిర్‌ఫైబర్ నేరుగా ఎయిర్‌టెల్‌తో పోటీ పడుతోంది. 

వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ రంగంలో ఇప్పటికే ఎయిర్‌టెల్ ఎయిర్‌ఫైబర్ సర్వీస్ ప్రారంభించింది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ రెండూ ఒకదానికొకటి పోటీపడే ప్లాన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్ రెండూ వివిధ రకాల ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. ఈ ప్లాన్స్ 30 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ వరకూ ఉన్నాయి. ఇది కాకుండా ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ లభిస్తాయి. హై స్పీడ్ ఇంటర్నెట్, ఓటీటీ ప్రయోజనాలు అన్నీ లభిస్తాయి.

జియో ఫైబర్ ప్రీపెయిడ్ ప్లాన్స్

399 రూపాయల ప్లాన్‌లో 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటాతో పాటు 30 రోజుల వరకూ వాయిస్ కాలింగ్ ఉచితంగా లభిస్తుంది. 

699 రూపాయల ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో పాటు ఉచిత వాయిస్ కాలింగ్, అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ యాక్సెస్‌తో కలిపి 30 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. 

999 రూపాయల ప్లాన్‌లో 150 ఎంబీపీఎస్ స్పీడ్, అన్‌లిమిటెడ్ డేటా, ఉచిత కాలింగ్‌తో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సేవలు లభిస్తాయి.

1499 రూపాయల ప్లాన్‌లో 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో పాటు ఉచితంగా 18 ఓటీటీ సేవలు, జియో సినిమా, జియో సావన్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సేవలు అందుతాయి. 

2499 రూపాయల ప్లాన్‌లో 500 ఎంబీపీఎస్ స్పీడ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో పాటు 16 ఇతర యాప్స్ యాక్సెస్ లభిస్తుంది. 

3999 రూపాయల ప్లాన్‌లో 1 జీబీపీఎస్ స్పీడ్‌తో పాటు 35000 జీబీ డేటాతో పాటు అదనంగా 7500 జీబీ డేటా లభిస్తుంది. ఇది కాకుండా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సహా 19  ఓటీటీ సేవలు లభిస్తాయి.

89499 రూపాయల ప్లాన్‌లో మొత్తం 6600 జీబీ డేటా 1 జీబీపీఎస్ స్పీడ్‌తో లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సహా 19 యాప్స్ ఉచితంగా వీక్షించవచ్చు. 

ఎయిర్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ ప్రీ పెయిడ్ ప్లాన్స్

ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ 499 రూపాయల ప్లాన్‌లో బేసిక్ ప్లాన్ రోజుకు 40 ఎంబీపీఎస్ స్పీడ్‌తో వస్తుంది. అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, వాయిస్ కాలింగ్‌తో పాటు వింక్ మ్యూజిక్, అపోలో ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం ప్యాక్ లభిస్తాయి. 

799 రూపాయల ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో పాటు అన్‌లిమిటెడ్ డేటాతో పాటు ఉచిత వాయిస్ కాలింగ్ లభిస్తుంది. 

999 రూపాయల ప్లాన్‌లో 200 ఎంబీపీఎస్ ప్లాన్‌‌తో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉచితంగా లభిస్తాయి. 

1498 రూపాయల ప్లాన్‌లో 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ సేవలు ఉచితంగా లభిస్తాయి. 

Also read: Income Tax Deadline: ఇన్‌కంటాక్స్ డెడ్ లైన్ అయిపోయింది, ఇక పెనాల్టీ ఎంత చెల్లించాలో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News