Jio Plans: జియో ఆ ప్లాన్ తీసుకుంటే, ఏడాది మొత్తం అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉచితం

Jio Plans: జియో ఇప్పుడు అద్భుతమైన ఆఫర్ ఇస్తోంది. రీఛార్జ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటు ఫుల్ డేటా ఇస్తోంది. అంతేకాదు..ఇంకా ఇతర చాలా ప్రయోజనాలున్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 22, 2023, 07:51 AM IST
  • జియో నుంచి మరో అద్భుతమైన ప్లాన్, ఏకంగా మూడు ఓటీటీలు ఉచితం
  • జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 399తో అద్భుతమైన ఆఫర్ ప్రారంభం
  • అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది సభ్యత్వం ఉచితం
Jio Plans: జియో ఆ ప్లాన్ తీసుకుంటే, ఏడాది మొత్తం అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉచితం

జియో యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు విభిన్న రకాల ప్లాన్స్ అందిస్తోంది. ఇప్పుడు అందిస్తున్న పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఆఫర్ కస్టమర్ల అవసరాల్ని తీర్చడమే కాకుండా..ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఇస్తుంది. ఈ ఆఫర్ వివరాలు తెలుసుకుందాం..

జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే వేలాది రూపాయలు సేవ్ అవడమే కాకుండా..ఈ ప్లాన్‌తో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది. అత్యధిక డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. ఈ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.

జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ వివరాలు

జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ విలువ 399 రూపాయలు నెలకు. ఇందులో ప్రతి నెల 75 జీబీ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల సౌకర్యముంటుంది. ఈ ప్లాన్‌లో డిస్నీ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వం ఏడాదికి లభిస్తుంది. 

ఇది పోస్ట్‌పెయిడ్ కావడంతో నెలయ్యాక ఆగిపోకుండా కొనసాగుతుంది. ప్రతినెలా రీఛార్జ్ చేయించాల్సిన అవసరముండదు. సేవలు నిలిచిపోకుండా కొనసాగుతుంటాయి. ప్రీపెయిడ్ సేవల్లో అయితే ప్రతి నెలా మర్చిపోకుండా రీఛార్జ్ చేయిస్తుండాలి. ఈ ప్లాన్ చాలా ప్రాచుర్యం పొందింది. యూజర్లు చాలా సులభంగా ఈ ప్లాన్ యాక్టివేట్ చేయించవచ్చు. అంటే ఏడాది పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఎంజాయ్ చేయవచ్చు. 

Also read: Share Market: షేర్ మార్కెట్‌లో మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను ఎలా గుర్తించాలి, 7 సులభమైన టిప్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News