Jio Cloud New Laptop Price: బడ్జెట్ సెగ్మెంట్లో జియో మరో ల్యాప్‌టాప్..రూ.16,000లోపే ఇంతకుముందు చూడని ఫీచర్లు మరెన్నో..

Jio Cloud New Laptop Price: ప్రముఖ భారత టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో బడ్జెట్ ధరలో మరో లాప్‌టాప్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ల్యాప్‌టాప్ ను రిలయన్స్ కంపెనీ క్లౌడ్ అనుసంధానంతో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ల్యాప్‌టాప్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2023, 12:00 PM IST
 Jio Cloud New Laptop Price: బడ్జెట్ సెగ్మెంట్లో జియో మరో ల్యాప్‌టాప్..రూ.16,000లోపే ఇంతకుముందు చూడని ఫీచర్లు మరెన్నో..

 

Jio Cloud New Laptop Price: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో బడ్జెట్ సెగ్మెంట్‌లో ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్స్‌తో పాటు ల్యాప్‌టాప్‌లను తయారుచేసి మార్కెట్లోకి విక్రయిస్తోంది. గత జూన్ నెలలో రిలయన్స్ రెండవ సిరీస్ ల్యాప్‌టాప్‌ జియో బుక్ JioBook (2023) విడుదల చేసిన ఒక సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ స్మార్ట్ లాప్‌టాప్‌ రూ.16,000లోపే అందుబాటులో ఉంది. అతి తక్కువ ధరలోని మరో కొత్త లాప్‌టాప్‌ను రిలయన్స్ జియో కంపెనీ క్లౌడ్ కంపెనీ అనుసంధానంతో మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌ ఇంతకుముందున్న ఫీచర్స్‌లా కాకుండా అనేక కొత్త అప్డేట్ స్పెసిఫికేషన్స్ తో రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే అతి త్వరలోనే విడుదల కాబోయే జియో కంపెనీ ల్యాప్‌టాప్‌ సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జియో క్లౌడ్ అనుసంధానంతో విడుదల కాబోయే నెక్స్ట్ జనరేషన్ లాప్‌టాప్‌ రూ.16,000లోపే ఉండబోతున్నట్లు సమాచారం. ఈ ల్యాప్‌టాప్‌కు సంబంధించిన సమాచారాన్ని ది ఏకనామిక్ టైమ్స్ నివేదికలో పేర్కొన్నారు. ఈ జియో ల్యాప్‌టాప్‌ మార్కెట్లోకి విడుదలయితే ప్రముఖ టెక్ కంపెనీ లైన్ లెనోవా, హెచ్ పి, డెల్ వంటి మల్టీ నేషనల్ బ్రాండ్లతో పోటీ పడబోతున్నట్లు సమాచారం. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

జియో రిలయన్స్ క్లౌడ్ అనుసంధానంతో విడుదల కాబోయే లాప్‌టాప్‌ "డంబెల్ టెర్మినల్" అన్ని ప్రాసెసింగ్ ఫీచర్‌తో రాబోతుంది. అంతేకాకుండా క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, స్టోరేజ్ ఫంక్షన్లను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. ఈ కంప్యూటర్ క్లౌడ్ మీద ఆధారపడి పని చేస్తుంది. కాబట్టి దీనిని వినియోగించుకునే క్రమంలో ఇంటర్నెట్ తప్పకుండా అవసరమవుతుంది.

ల్యాప్‌టాప్ ధర, మెమరీ, ప్రాసెసింగ్ పవర్, చిప్‌సెట్ మొదలైన వాటి హార్డ్‌వేర్‌పై ఆధారపడి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ లాప్‌టాప్‌ శక్తివంతమైన హార్డ్వేర్ తో పాటు, పెద్ద బ్యాటరీని కూడా కలిగి ఉంటున్నట్లు సమాచారం.. అంతేకాకుండా యాపిల్ ఐక్లౌడ్ లేదా గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్‌ల మాదిరిగానే నెలవారీ క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌తో ల్యాప్‌టాప్‌ను బండిల్ చేయాలని జియో యోచిస్తోందని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా ఈ ల్యాప్టాప్ JioBook ఆక్టా-కోర్ MediaTek MT8788 ప్రాసెసర్‌, Android ఆధారిత JioOS ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుందని సమాచారం. ఈ లాప్‌టాప్‌కి సంబంధించిన అధికారిక సమాచారాన్ని రిలయన్స్ జియో కంపెనీ కానీ క్లౌడ్ కంపెనీ కానీ ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News