iPhone 14: మూడ్రోజుల్లో ఐఫోన్ 14 లాంచ్, ఐఫోన్ 14 ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే

iPhone 14: ఐపోన్ ప్రేమికులకు శుభవార్త. అందరూ ఎదురుచూస్తున్న ఐఫోన్ 14 కేవలం మూడ్రోజుల్లో లాంచ్ కానుంది. సెప్టెంబర్ 7న లాంచ్ కానున్న ఐఫోన్ 14 ప్రత్యేకతలు, ధర ఎంతనేది తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 4, 2022, 11:21 PM IST
iPhone 14: మూడ్రోజుల్లో ఐఫోన్ 14 లాంచ్, ఐఫోన్ 14 ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే

iPhone 14: ఐపోన్ ప్రేమికులకు శుభవార్త. అందరూ ఎదురుచూస్తున్న ఐఫోన్ 14 కేవలం మూడ్రోజుల్లో లాంచ్ కానుంది. సెప్టెంబర్ 7న లాంచ్ కానున్న ఐఫోన్ 14 ప్రత్యేకతలు, ధర ఎంతనేది తెలుసుకుందాం..

ఎన్నాళ్ల నుంచో నిరీక్షిస్తున్న ఐఫోన్ 14 లాంచ్ డేట్ వచ్చేసింది. కేవలం మూడ్రోజుల్లో అంటే సెప్టెంబర్ 7వ తేదీన లాంచ్ కానుంది. ప్రతియేటా జరిగినట్టే ఈవెంట్ స్టార్ మోడల్‌ను వెనీలా మోడల్‌గా పిలుస్తారు. ఐఫోన్ 14 ధర ఎంత ఉండవచ్చు, ఏయే ఫీచర్లున్నాయో తెలుసుకుందాం..

ఐఫోన్ 14 ధర ఎంత

యాపిల్ సంస్థ ఇప్పటి వరకూ ఐఫోన్ 14 ధరపై ఏ విధమైన ప్రకటన చేయలేదు. ఎటువంటి సమచారం జారీ చేయలేదు. ఐఫోన్ 13తో పోలిస్తే కాస్త తక్కువ ధరతో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఐఫోన్ 13 అమెరికాలో 799 డాలర్లకు లాంచ్ అయింది. ఐఫోన్ 14 ప్రారంభ ధర 749 డాలర్లు ఉండవచ్చని తెలుస్తోంది. అంటే దాదాపు 50 డాలర్లు తక్కువ. 

ఐఫోన్ 14 ధరను యాపిల్ సంస్థ తగ్గిస్తుందా లేదా ఐఫోన్ 13తో సమానంగా ఉంచుతుందా అనేది చూడాల్సి ఉంది. పెరుగుతున్న ధరల్ని బట్టి చూస్తే ఐఫోన్ గతంలో పోలిస్తే తగ్గించే అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఐఫోన్ 14 ధర తక్కువగా ఉంటుందా లేదా ఎక్కువే ఉంటుందా అనేది సెప్టెంబర్ 7నే తెలుస్తోంది. 

ఐఫోన్ 14 ఎలా ఉండనుంది

ఐఫోన్ 14 డిజైన్..ఐఫోన్ 13లానే ఉండవచ్చని తెలుస్తోంది. డిస్‌ప్లే పైభాగంలో వెడల్పైన నాచ్ ఉంటుంది. ప్రో మోడల్ మాత్రం గోళీ ఆకారంలో ఉంటుంది. డిస్‌ప్లే ఆకారం కూడా ఐఫోన్ 13 ఉన్నట్టే ఉంటుంది. ఐఫోన్ 14.. 6.1 ఇంచెస్ లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఐఫోన్ 14లో లేటెస్ట్ వెర్షన్ ఏ16 బయోనిక్ చిప్ సెట్ ఉండవచ్చు. ఐఫోన్ 13 వలే..128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో రానుంది. ఐఫోన్ 13లో మాత్రం ఏ15 బయోనిక్ చిప్ ఉంది. 

కెమేరా ఎలా ఉండనుంది

ఐఫోన్ 14లో రేర్ ప్యానల్‌లో డ్యూయల్ కెమేరా, సెల్ఫీ కోసం ఫ్రంట్ సింగిల్ కెమేరా ఉంటుంది. ఐఫోన్ 14 కెమేరా తక్కువ వెలుతురులో సైతం..బెస్ట్ ఫోటోగ్రఫీ ఉండవచ్చు. మరోవైపు అల్ట్రా వైడ్ కెమేరా లేదా యాస్ట్రో ఫోటోగ్రాఫిక్ ఆప్షన్ ఉండవచ్చు. ఐఫోన్ 14 బ్యాటరీ సామర్ధ్యం కూడా ఎక్కువే ఉండవచ్చు. ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ వేరియంట్లు సెప్టెంబర్ 7వ తేదీన లాంచ్ కానున్నాయి.

Also read: Tata Sons vs Cyrus Mistry: సైరస్ మిస్త్రీ ఎవరు, టాటా గ్రూపుకు , సైరస్ మిస్త్రీకు ఉన్న వివాదమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News