iPhone 13 Price: ఐఫోన్‌ 13పై ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు.. ధర తెలిస్తే వెంటనే కొనేసుకుంటారు!

Buy iPhone 13 phone just Rs 43090 in Big Diwali Sale 2022. ఐఫోన్ 13 మోడల్‌పై ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్ ఉంది. ఐఫోన్‌ 13 రూ. 43,090కి మీ సొంతమవుతుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 20, 2022, 12:51 PM IST
  • ఐఫోన్‌ 13పై ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు
  • ధర తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు
  • ట్రెండింగ్‌లో ఐఫోన్ 14 సిరీస్
iPhone 13 Price: ఐఫోన్‌ 13పై ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు.. ధర తెలిస్తే వెంటనే కొనేసుకుంటారు!

Buy iPhone 13 phone just Rs 43090 in Big Diwali Sale 2022: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ 'యాపిల్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఫాన్స్ ఈ సంస్థకు ఉన్నారు. ఇండియాలో కూడా యాపిల్‌ ఐఫోన్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. స్మార్ట్ ఫోన్ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న యాపిల్.. ఎప్పటికప్పుడు కొత్తకొత్త స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తుంది. ప్రస్తుతం ఐఫోన్ 14 సిరీస్ ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఐఫోన్ 13 మోడల్‌పై ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్ ఉంది. 

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 'బిగ్ దీపావళి సేల్' నడుస్తోంది. అక్టోబర్ 19న మొదలైన ఈ సేల్ అక్టోబర్ 23న ముగుస్తుంది. బిగ్ దీపావళి సేల్ సందర్భంగా యాపిల్ కంపెనీ ఐఫోన్‌ 13 మరియు ఐఫోన్‌ XSతో సహా పలు స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ క్రమంలోనే  ఐఫోన్‌ 13 128GB స్మార్ట్‌ఫోన్ 14 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. దాంతో ఈ ఫోన్ రూ. 59,990కు కైవసం చేసుకోవచ్చు. రూ. 16,900 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దాంతో ఐఫోన్‌ 13 రూ. 43,090కి మీ సొంతమవుతుంది. 

ఐఫోన్ 12 64 మోడల్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో 9 శాతం తగ్గింపు ఉంది. అప్పుడు రూ. 59,900 ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 53,990 మీకు అందుబాటులో ఉంది. ఇక బిగ్ దీపావళి సేల్ సమయంలో ఈ ఐఫోన్‌పై రూ. 16,900 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. అప్పుడు ఐఫోన్ 12 ధర వినియోగదారులకు రూ. 37,090లకి అందుబాటులో ఉంటుంది.

బిగ్ దీపావళి సేల్‌లో భాగంగా ఐఫోన్ మాత్రమే కాదు రియల్ మీ, పోకో, సామ్ సంగ్, ఒప్పో, వివో, షియామీ, మోటోరోలా, గూగుల్, ఇంఫినిక్స్ మరియు లావాతో సహా పలు స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఉన్నాయి. బిగ్ దీపావళి సేల్‌లో SBI బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి చేసే కొనుగోళ్లపై 10 శాతం తక్షణ తగ్గింపు ఉంది. Paytm వాలెట్ మరియు UPI ఉపయోగించి చేసే లావాదేవీలపై 10 శాతం క్యాష్‌ బ్యాక్ ఉంది. వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ టీవీలు, ఎయిర్ కండిషనర్లు మరియు హోమ్ ఉత్పత్తులపై 75 శాతం వరకు తగ్గింపు ఉంది. 

Also Read: పాక్‌లో షాహీన్ ఆఫ్రిది కంటే ప్రమాదకరమైన బౌలర్ ఉన్నాడు.. భారత్ అప్రమత్తంగా ఉండాల్సిందే: ఆకాశ్‌ 

Also Read: Unstoppable With NBK: మూడో ఎపిసోడ్ కు కూడా ఇద్దరు కుర్ర హీరోలు.. ఎవరెవరంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News