Infinix Note 40: కేక పెట్టించే JBL సౌండ్, 108 MP కెమేరాతో 16 వేలకే కొత్త స్మార్ట్‌ఫోన్

Infinix Note 40: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. అద్భుతమైన ఫీచర్లతో , ఏకంగా 108 మెగాపిక్సెల్ కెమేరా ఉన్న ఫోన్ కేవలం 16 వేలకే మీ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 22, 2024, 08:02 AM IST
Infinix Note 40: కేక పెట్టించే JBL సౌండ్, 108 MP కెమేరాతో 16 వేలకే కొత్త స్మార్ట్‌ఫోన్

Infinix Note 40: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇన్‌ఫినిక్స్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇది. Infinix Note 40 5G ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయిపోయింది. కెమేరా, ర్యామ్, డిస్‌ప్లే అన్నీ ప్రీమియం ఫోన్లలానే ఉంటాయి. ఇదే ఫీచర్లతో మార్కెట్‌లో ఉన్న ఇతర ఫోన్లతో పోలిస్తే చాలా తక్కువ ధరకే లభించనుంది. 

Infinix Note 40 5Gలో 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఫ్లెక్సిబుల్ ఎమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. రెండేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ , మూడేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇందులో ఉండే పవర్ మేనేజ్మెంట్ చిప్ కారణంగా తక్కువ హీట్ జనరేట్ చేసేందుకు బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ ఉంటుంది. 

అన్నింటికంటే ముఖ్యంగా జేబీఎల్ సౌండ్ సిస్టమ్ ఉండటంతో మ్యూజిక్ అద్భుతంగా ఎంజాయ్ చేయవచ్చు. స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్ కోసం ఐఆర్ రిమోట్ కంట్రోల్ వ్యవస్థ ఉంది. వైఫై 5, బ్లూటూత్, టైప్ సి ఛార్జర్ ఉన్నాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ విషయంలో ఐపీ 53 రేటింగ్ కలిగి ఉంది. 

ఈ ఫోన్‌లో 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉంటుంది. ఇక కెమేరా అయితే వెనుదిరిగి చూసుకోవల్సిన అవసరం లేదు. ఇందులో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హెలో లైటింగ్ కలిగి ఉంటుంది. 

కెమేరాపరంగా ఈ ఫోన్‌లో ఇంకా చాలా ఫీచర్లు ఉన్నాయి. 15కు పైగా కెమేరా మోడ్స్ ఉన్నాయి. డీఎస్ఎల్ఆర్ కెమేరాకు ఉన్నట్టే డెప్ట్ ఎఫెక్ట్ కోసం పోర్ట్రెయిట్ మోడ్, లో లైట్ ఫోటోగ్రఫీ, సూపర్ నైట్ మోడ్, స్కై ఎడిటింగ్, ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమేరా రికార్డింగ్. డ్యూయల్ వీడియో మోడ్  ఆప్షన్లు ఉన్నాయి. 

ఈ ఫోన్ అసలు ధర 19,999 రూపాయలు కాగా 17,999 రూపాయలకు లభిస్తోంది. ఇది కాకుండా అదనంగా 2 వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. దాంతో 15,999 రూపాయలకే లభిస్తోంది. ఈ ఫోన్ అమ్మకాలు జూన్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. 

Also read: Budget 2024 25: కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగులకు భారీ ఊరట.. రూ.లక్షల్లో అద్భుత ప్రయోజనాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News