Hyundai Creta: మైండ్ బ్లాక్ చేస్తున్న క్రెటా కొత్త మోడల్.. ధర ఎంతో తెలుసా?

Hyundai Creta: హ్యుందాయ్ క్రెటా యెుక్క ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ అంతర్జాతీయ మార్కెట్లో సందడి చేస్తుంది. తాజాగా దీనిని ఇండోనేషియాలో లాంచ్ చేశారు. దీని యెుక్క ఫీచర్లు, ధర, ఇండియాలో ఎప్పుడు వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2023, 12:32 PM IST
Hyundai Creta: మైండ్ బ్లాక్  చేస్తున్న క్రెటా కొత్త మోడల్.. ధర ఎంతో తెలుసా?

Hyundai Creta Dynamic Black edition 2023: దేశంలో ఎక్కువగా సేల్ అవుతున్న ఎస్యూవీ కార్లలో హ్యుందాయ్ క్రెటా ఒకటి. తాజాగా దీని యెుక్క డైనమిక్ బ్లాక్ ఎడిషన్ అంతర్జాతీయ మార్కెట్లో సందడి  చేస్తుంది. ప్రస్తుతం ఈ కొత్త కారు ఇండోనేషియా మార్కెట్లో విడుదలైంది. అయితే ఇది ఇండియాలోని నైట్ ఎడిషన్‌ను పోలి ఉంటుంది. అయితే దీని డిజైన్ ఫేస్‌లిఫ్టెడ్ క్రెటాపై ఆధారపడి ఉంటుంది. 

ఏయే ఫీచర్లు ఉన్నాయంటే..
ఇది టక్సన్ SUV మాదిరిగానే ఇంటిగ్రేటెడ్ LED DRLలతో వస్తుంది. దీని ముందు భాగంలో పారామెట్రిక్ గ్రిల్‌ ఉంటుంది. దీని లోపలి భాగంలో బ్లాక్ డ్యాష్ బోర్డు వస్తుంది. ఇందులో 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ అందుబాటులో ఉండగా... మనదేశంలో 10.25-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది.. క్రెటా డైనమిక్ బ్లాక్ ఎడిషన్‌లోని ఫీచర్లలో లెథెరెట్ సీట్ అప్హోల్స్టరీ, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్ ఉన్నాయి. ఈ కారు ADAS ఫీచర్‌తో వస్తుంది. ఇందులో ఫార్వర్డ్ కొలిజన్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ అలర్ట్ మరియు రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనిలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ESC, VSM, TPMS మరియు HAC ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. 

ధర ఎంతంటే..
ఇండోనేషియా వెర్షన్ క్రెటా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇందులో ఆరు-స్పీడ్ మాన్యువల్ మరియు సీవీటీ యూనిట్ ఉన్నాయి. ఇండియాలో ఈ మోడల్ ఈఏడాది చివర్లో వచ్చే అవకాశం ఉంది. ఇండోనేషియా మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా యొక్క ఈ ఎడిషన్ ధర దాదాపు 35 కోట్ల రూపాయలు (INR 19 లక్షలు).

Also Read: Toyota Innova Hycross Mileage: డెడ్‌ ఛీప్‌గా 8 సీటర్ టయోటా ఇన్నోవా హైక్రాస్.. ఫీచర్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారు.!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News