Honor Play 40c Price: భారత మార్కెట్‌లోకి తర్వలోనే Honor Play 40C స్మార్ట్‌ ఫోన్‌, ఫీచర్లు, ధర వివరాలు ఇవే

Honor Play 40c Price In India: హానర్ కంపెనీ త్వరలో తమ మరో స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఈ మొబైల్‌ ఫోన్‌ను ఇప్పటికే కంపెనీ చైనాలో విడుదల చేసింది. అంతేకాకుండా ఇందులో చాలా రకాల కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ ఫీచర్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 17, 2023, 02:22 PM IST
Honor Play 40c Price: భారత మార్కెట్‌లోకి తర్వలోనే Honor Play 40C స్మార్ట్‌ ఫోన్‌, ఫీచర్లు, ధర వివరాలు ఇవే

Honor Play 40c Price In India: ప్రముఖ చైనీస్‌ టెక్‌ కంపెనీ హానర్ త్వరలో మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయబోతోంది. హానర్ ప్లే 40C పేరుతో ఈ మొబైల్‌ ఫోన్‌ను విడుదల చేయబోతోందని సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్‌ 6 GB,  128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లో లభించబోతోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ ఫోన్‌ మూడు ఆప్షన్‌లలో కంపెనీ విడుదల చేయబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ మొబైల్‌ ఫోన్‌ అద్భుతమైన ఫీచర్లలతో త్వరలో ప్రపంచ మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. అయితే కంపెనీ ఇప్పటికే చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. కంపెనీ  ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 899 యువాన్లు (దాదాపు రూ. 10,300)ధరతో కస్టమర్లకు అందిస్తోంది. ఈ మొబైల్‌ ఫోన్‌లో చాలా రకాల కొత్త ఫీచర్లు రాబోతున్నట్లు ప్రముఖ టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

Honor Play 40C స్పెసిఫికేషన్స్‌:
Honor Play 40C స్మార్ట్‌ ఫోన్‌ 1612x720 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.56 అంగుళాల LCD వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ HD + రిజల్యూషన్‌తో కూడిన ఈ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌తో రాబోతోంది. అంతేకాకుండా గేమింగ్‌, మల్టీ టాస్కింగ్‌ కోసం ఈ ఫోన్‌ 6 GB ర్యామ్‌, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌‌ను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. ఇక ప్రాసెసర్‌గా స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ చిప్‌సెట్‌తో పాటు 13 ఎంపీ బ్యాంక్‌ కెమెరాతో రాబోతోందని సమాచారం. అంతేకాకుండా 5200mAh బ్యాటరీని సమర్థ్యాన్ని కలిగి ఉండబోతోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌లో చాలా రకాల కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 

Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?

ఇతర ఫీచర్లు:
6.56 అంగుళాల LCD వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌
స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ చిప్‌సెట్‌
13 ఎంపీ బ్యాంక్‌ కెమెరా
5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
5200mAh బ్యాటరీ
10W ఛార్జింగ్‌ సపోర్ట్‌
Android 13 MagicOS 7.1
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌
3.5mm హెడ్‌ఫోన్ జాక్
డ్యూయల్ సిమ్
బ్లూటూత్

Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News