Honor 90 5G Offer: 200MP కెమెరా సెటప్‌ Honor 90 మొబైల్‌పై భారీ తగ్గింపు.. డిస్కౌంట్‌ వివరాలు ఇవే..

Honor 90 5G Price: 200MP కెమెరా సెటప్‌ కలిగిన స్మార్ట్ ఫోన్‌ను అతి తక్కువ ధరలో కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేకమైన ఆఫర్‌ను అందిస్తోంది. గత సంవత్సరంలో విడుదలైనా హానర్ 90 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది.

Last Updated : Jan 6, 2024, 08:56 AM IST
Honor 90 5G Offer: 200MP కెమెరా సెటప్‌ Honor 90 మొబైల్‌పై భారీ తగ్గింపు.. డిస్కౌంట్‌ వివరాలు ఇవే..

Honor 90 5G Offer Price: ప్రస్తుతం యువత ఎక్కువగా శక్తివంతమైన కెమెరా కలిగి స్మార్ట్‌ ఫోన్స్‌ మాత్రమే కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.  దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ టెక్‌ కంపెనీలు కూడా ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. హానర్ గత సంవత్సరంలో విడుదల చేసిన హానర్ 90 5G స్మార్ట్‌ఫోన్‌ 200MP కెమెరా సెటప్‌తో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌ను వినియోగించి డెడ్‌ చీప్‌ ధరకే పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హానర్ 90 5G స్మార్ట్‌ఫోన్‌ 200MP కెమెరా సెటప్‌తో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ అసలు ధర MRP రూ.47,999 కాగా ప్రత్యేక డీల్‌లో భాగంగా ఈ మొబైల్‌ 27 శాతం తగ్గింపుతో కేవలం రూ.34,999కే అందుబాటులో ఉంది. దీంతో పాటు అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు 10 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు IDFC, OneCard,Yes Bank బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌  రూ.33,999కే పొందవచ్చు. అంతేకాకుండా మీరు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించిన 5 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

Honor 90 5G ఫీచర్స్, స్పెషిఫికేషన్స్‌:
❁ 200MP ప్రధాన కెమెరా
❁ Qulacomm Snaodragon 7 Gen 1 ప్రాసెసర్‌
❁ 8GB RAM, 256GB స్టోరేజ్‌
❁ 6.7 అంగుళాల 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే
❁ 1600నిట్స్ బ్రైట్‌నెస్‌
❁ 840 PWM డిమ్మింగ్ టెక్నాలజీ
❁ 12MP అల్ట్రా-వైడ్ కెమెరా
❁ 2MP డెప్త్ కెమెరా
❁ 5000mAh కెపాసిటీ బ్యాటరీ
❁ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 
❁ Android 13 ఆధారంగా MagicOS 7.1

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News