Holi 2024 Smartphone Sale: రియల్ మీ మొబైల్స్‌పై హోలీ అద్భుతమైన ఆఫర్స్‌.. రూ.3 వేల తగ్గింపు!

Holi 2024 Smartphone Sale: హోలీ పండగ సందర్భంగా రియల్‌ మొబైల్స్‌పై ప్రత్యేక సేల్‌ ప్రారంభయ్యాయి. ఈ సేల్‌ భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 22, 2024, 12:29 PM IST
Holi 2024 Smartphone Sale: రియల్ మీ మొబైల్స్‌పై హోలీ అద్భుతమైన ఆఫర్స్‌.. రూ.3 వేల తగ్గింపు!

Holi 2024 Smartphone Sale: ఈ సంవత్సరం మార్చి 24వ తేదిన హోలీ పండగ రాబోతోంది. అయితే ఈ పండగను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెరీ రియల్‌మీ భారీ ఆఫర్స్‌ను ప్రకటించింది. అన్ని రకాల రియల్‌మీ మొబైల్స్‌ను భారీ తగ్గింపుతో విక్రయించబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఆఫర్స్‌కి సంబంధించిన ప్రకటనను కూడా సోషల్ మీడియాలో వెల్లడించింది.  ఈ ఆఫర్స్‌ మార్చి 21 నుంచి మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ హోలీ పండగ ప్రత్యేక సేల్‌ను రియల్‌మీ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అధికారిక రియల్‌ మీ వెబ్‌సైట్‌లో లైవ్‌ చేయ్యబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన Realme 12 Pro Series 5G స్మార్ట్‌ఫోన్‌పై దాదాపు రూ. 5000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఇతర మొబైల్స్‌పై కూడా డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ డిస్కౌంట్‌ ఆఫర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ మొబైల్స్‌పై ప్రత్యేక డీల్స్‌:
ప్రస్తుతం మార్కెట్‌లో రియల్‌మీ 12+ 5G స్మార్ట్‌ఫోన్  8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌పై రూ. 1000 వరకు ప్రత్యేక కూపన్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా అదనంగా ఎక్చేంజ్‌ భోనస్‌ కూడా రూ. 1000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో పాటు  9 నెలల నో-కాస్ట్ EMI ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. 

దీంతో పాటు రియల్‌మీ 12+ 5G మొబైల్‌పై కూడా ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన వేరియంట్‌పై దాదాపు రూ. 1500 బ్యాంక్ ఆఫర్ కూడా లభిస్తోంది. దీంతో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. 

అలాగే హోలీ పండగ సందర్భంగా రియల్‌మీ 12 5G స్మార్ట్‌ఫోన్‌పై కూడా ప్రత్యేకమైన ఆఫర్స్‌ లభిస్తున్నాయి. దీంతో పాటు ఈ మొబైల్‌పై ప్రత్యేకమైన కూపన్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు రూ.2000 వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే రూ.1,000 సూపర్ కాయిన్, బ్యాంక్ ఆఫర్‌తో పాటు 6 నెలల నో కాస్ట్ EMI ఆప్షన్‌ను కూడా పొందవచ్చు. 

రియల్‌మీ 12 5G స్మార్ట్‌ఫోన్‌పై కూడా హోళీ ప్రత్యేక సేల్‌ డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌లో రూ. 1500 వరకు బ్యాంక్ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. దీంతో పాటు రూ. 1500 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ కూడా అందుంబాటులో ఉంది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

దీంతో పాటు Realme 12 Pro+ 5G స్మార్ట్‌ఫోన్‌పై కూడా ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తోంది. 8GB ర్యామ్‌, 128GB స్టోరేజ్‌ వేరియంట్ కలిగిన మొబైల్‌పై రూ. 1000 కూపన్ వరకు ప్రత్యేకమైన కూపన్‌ లభిస్తోంది. దీంతో పాటు రూ. 4000 వరకు బ్యాంక్ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అలాగే రూ. 3000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా లభిస్తుంది. 

అలాగే రియల్‌మీ 12 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసేవారికి కూడా ప్రత్యేక డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈ సేల్‌లో భాగంగా 8GBర్యామ్‌, 256GB ఇంటర్నల్‌  స్టోరేజ్‌ కలిగిన వేరియంట్‌పై రూ. 3,000 వరకు బ్యాంక్ ఆఫర్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై రూ. 3,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News