Great Republic Day Sale: Amazon సేల్‌లో బిగ్‌ లూట్..నోకియా మొబైల్స్‌ కేవలం రూ.1,500కే పొందండి..

Amazon Great Republic Day Sale 2024: అతి తక్కువ ధరకే మంచి కీ ప్యాడ్‌ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి అమెజాన్‌ ప్రత్యేకమైన డిస్కౌంట్‌ను అందిస్తోంది. అమెజాన్‌ అందించే సేల్‌ భాగంగా అన్ని రకాల మొబైల్స్‌ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2024, 10:47 AM IST
 Great Republic Day Sale: Amazon సేల్‌లో బిగ్‌ లూట్..నోకియా మొబైల్స్‌ కేవలం రూ.1,500కే పొందండి..

 

Amazon Great Republic Day Sale 2024: అమెజాన్‌లోని గత వారం ప్రారంభమైన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా కొన్ని వస్తువులు బంపర్ డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల వరకు అన్ని ప్రత్యేక తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా నోకియా కంపెనీకి సంబంధించిన కొన్ని కీప్యాడ్ ఫోన్స్ డెడ్ చీఫ్ ధరలకు లభిస్తున్నాయి. ఆ మోడల్స్ ఏంటో? ఆ మొబైల్స్‌ని ఎలా కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చో దానికి సంబంధించిన మరిన్ని వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం యువకుల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఎక్కువగా కీ ప్యాడ్స్‌ ఫోన్లను వినియోగిస్తున్నారు. అయితే చదువు రాని వారికోసం, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ వినియోగించని వారికోసం నోకియా కొన్ని కీప్యాడ్ మొబైల్స్‌ను అందిస్తోంది. అంతేకాకుండా నోకియా ఇటీవలే విడుదల చేసిన కొన్ని కీప్యాడ్ మొబైల్స్ లో UPI చెల్లింపు వంటి కొన్ని స్మార్ట్ ఫీచర్లు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇలాంటి మొబైల్స్ పై ఈరోజు అమెజాన్ ప్రత్యేక తగ్గింపుతో విక్రయిస్తోంది.

Nokia 106:
ఈ మోడల్ ఫోన్‌లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇది ప్రత్యేక మైక్రో SD కార్డ్ సహాయంతో MP3 ప్లేయర్, వైర్‌లెస్ రేడియో వంటి ఫీచర్స్‌ తో మార్కెట్‌లో లభిస్తోంది. దీంతోపాటు మీ మొబైల్ సహాయంతో UPI పేమెంట్ ఆప్షన్ కూడా లభిస్తుంది. ప్రస్తుతం ఈ మొబైల్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా 26% తగ్గింపుతో రూ.1,399కే అందుబాటులో ఉంది.

Nokia All-New 105 Dual Sim:
ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా నోకియా కంపెనీ ఇటీవల విడుదల చేసిన 105 డ్యూయల్ సిమ్ మోడల్ పై కూడా ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తోంది. ఈ మొబైల్ కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకునే విధంగా ప్రత్యేకమైన ఆప్షన్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ కీప్యాడ్ ఫోన్‌లో వైర్‌లెస్ FM రేడియో, 4G SIM సపోర్ట్ వంటి చాలా రకాల ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ అమెజాన్ సేల్‌లో 15% తగ్గింపుతో రూ. 1,449కి లభిస్తుంది. 

Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..

Nokia 110:
ఈ Nokia 110 మోడల్‌ మొబైల్‌ కూడా ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది. ఇందులో కూడా  MP3 ప్లేయర్, బ్యాక్‌ కెమెరా, పొడవైన బ్యాటరీ, వాయిస్ రికార్డర్ వంటి ఫీచర్లు లభిస్తాయి. అయితే ఈ మొబైల్‌ ప్రస్తుతం ప్రత్యేక సేల్‌లో భాగంగా 29% తగ్గింపుతో కేవలం రూ.1,499కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీని కోసం అమెజాన్‌ అధికారిక వైబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News