Moto G31 Price: 50MP కెమెరా, AMOLED డిస్ప్లే కలిగిన MOTOROLA g31 మొబైల్‌ కేవలం రూ.12,500కే..పూర్తి వివరాలు ఇలా..

Get Moto G31 Half Price: మీరు తక్కువ ధరలో శక్తివంతమైన కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, Motorola G31ని రూ.12,000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రత్యేక డీల్‌లో ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2024, 04:23 PM IST
Moto G31 Price: 50MP కెమెరా, AMOLED డిస్ప్లే కలిగిన MOTOROLA g31 మొబైల్‌ కేవలం రూ.12,500కే..పూర్తి వివరాలు ఇలా..

Get Moto G31 Half Price: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన కెమెరా మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీ కోసం ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక సేల్‌ను అందిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా కొన్ని టెక్‌ బ్రాండ్‌కు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. ముఖ్యంగా ఇటీవలే మోటరోలా నుంచి మార్కెట్‌లోకి విడుదలైన  Moto G31 మొబైల్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేకమైన ఫ్లాట్‌ తగ్గింపును అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం ఈ MOTOROLA g31 స్మార్ట్ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో రెండు వేరియంట్‌లో లభిస్తోంది. మొదటి వేరియంట్‌ 4GB + 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ అయితే..రెండవది 6GB + 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంది. ప్రస్తుతం 4GB + 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌ కలిగిన ఈ MOTOROLA g31 స్మార్ట్ ఫోన్‌ అసలు MRP ధర రూ.16,999తో లభిస్తోంది. అయితే ప్రత్యేక సేల్‌లో భాగంగా 23 శాతం తగ్గింపుతో కేవలం రూ.12,999కే అందుబాటులో ఉంది. దీంతో పాటు మీరు అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా వినియోగించవచ్చు. దీని కోసం ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ కొత్త మొబైల్‌ను రూ.12,500కే పొందవచ్చు. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

Moto G31 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌:
ఈ Moto G31 స్మార్ట్ ఫోన్‌ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ మొబైల్‌ అతి శక్తివంతమైన MediaTek ప్రాసెసర్‌తో లభిస్తోంది. ఇక ఫ్రాంట్‌ సెట్‌లో 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. బ్యాక్‌ సెట్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ క్వాడ్ ఫంక్షన్‌తో రాబోతోంది. దీర్ఘకాలం బ్యాటరీ ప్యాకప్‌ కోసం 5000mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీని అందిస్తోంది. 

ఇతర ఫీచర్స్‌:
❃ 6.4 అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లే
❃ MediaTek Helio G85 ప్రాసెసర్
❃ 50MP ప్రైమరీ కెమెరా
❃ 8MP అల్ట్రా-వైడ్ కెమెరా 
❃ 2MP మాక్రో కెమెరా
❃ 13MPసెల్ఫీకెమెరా
❃ 5000mAh బ్యాటరీ

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News