Infinix Hot 11: ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిక్స్ హాట్ 11 స్మార్ట్‌ఫోన్‌పై 30 శాతం భారీ డిస్కౌంట్, ధర ఎంతంటే

Infinix Hot 11: తక్కువ ధరకు..అద్భుత ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా..అయితే ఫ్లిప్‌కార్ట్ మీ కోసం అద్బతమైన డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 8, 2022, 11:34 PM IST
Infinix Hot 11: ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిక్స్ హాట్ 11 స్మార్ట్‌ఫోన్‌పై 30 శాతం భారీ డిస్కౌంట్, ధర ఎంతంటే

Infinix Hot 11: తక్కువ ధరకు..అద్భుత ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా..అయితే ఫ్లిప్‌కార్ట్ మీ కోసం అద్బతమైన డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. 

ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 స్మార్ట్‌ఫోన్ గురించి వినే ఉంటారు. ఇప్పుడీ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా 30 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అది కూడా ఫ్లిప్‌‌కార్ట్‌పై. ఇదొక ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్. తక్కువ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ ఆఫర్, ఫీచర్ల గురించి తెలుసుకుందాం..

ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 ఫీచర్లు

ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో..550 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ UniSoC T610 ప్రోసెసర్‌తో నడుస్తుంది. ఇక కెమేరా విషయానికొస్తే..13 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కెమేరా కోసం 8 మెగాపిక్సెల్ ఉంది. అంతేకాకుండా..5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఫోన్ ఛార్జింగ్ కోసం 10 వాట్స్ ఛార్జర్ లభిస్తుంది. 

ఇన్ఫినిక్స్ హాట్ 11 2022  ఆఫర్

ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే కేవలం 8999 రూపాయలకే లభించనుంది. ఎందుకంటే 30 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర 12,999 రూపాయలు. భారీ డిస్కౌంట్ కారణంగా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ అయినా..మంచి ఫీచర్లు ఉన్నాయి. 

Also read: Car Insurance Policy: బెంగళూరు వరద వంటి పరిస్థితుల్లో కార్ల ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా..ఏ పాలసీ తీసుకోవాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News