Vivo Y18e Features: అద్భుతమైన ఫీచర్లతో వివో మరో కొత్త ఫోన్‌ను మన దేశంలో లాంచ్ చేసింది. Vivo Y18e పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఫిబ్రవరిలో రెండు వివో ఫోన్‌లు Y18, Y18e బ్లూటూత్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నాయి. వీటిలో Y18 లాంచ్ డేట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. Y18e స్మార్ట్‌ఫోన్‌ను మాత్రం భారత్‌లో రిలీజ్ చేశారు. ఈ ఫోన్ ఫీచర్లు ఏంటి..? స్పెసిఫికేషన్‌లు ఎలా ఉన్నాయి..? ఇప్పుడు చుద్దాం..
Also Read: Nothing Phone 2a: త్వరపడండి.. మే 2న అతి తక్కువ ధరకే Nothing Phone 2a 5జీ స్మార్ట్‌ఫోన్
వివో Y18e స్పెసిఫికేషన్స్ ఇలా..
ఈ స్మార్ట్ ఫోన్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. పొడవు 163.63mm, వెడల్పు 75.85mm, మందం 8.39mm గా ఉంటుంది. బరువు విషయానికి 185 గ్రాములు ఉంటుంది. 6.56 అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్, 1612 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను ఇస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది.
కెమెరా ఇలా..
Vivo Y18e స్మార్ట్ ఫోన్‌లో ఫ్రంట్ కెమెరా కోసం స్క్రీన్‌పై మధ్యలో చిన్న కటౌట్ ఉంది. ఈ కటౌట్‌లో f/2.2 ఎపర్చరుతో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను యాడ్ చేశారు. బ్యాక్ సైడ్ కెమెరా కోసం ఒక బ్లాక్ ఉంది. ఈ బ్లాక్‌లో f/2.2 ఎపర్చరుతో 13-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్, f/3.0 ఎపర్చర్‌తో 0.08-మెగాపిక్సెల్ హెల్పింగ్ లెన్స్ ఉన్నాయి. అంతేకాకుండా బ్యాక్‌సైడ్ మరో ఫ్లాష్ కూడా ఉంటుంది.
బ్యాటరీ ఇలా..
ఈ ఫోన్‌లో Helio G85 అనే ప్రాసెసర్ ఉంది. ఇది Android 14 బేస్‌గా FunTouch OS 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ను రన్ చేస్తుంది. 4 GB RAM, 64 GB స్టోరేజ్‌తో ఉంది. 4 GB వరకు వర్చువల్ RAMకి సపోర్ట్ చేస్తుంది. ఎక్స్ ట్రా స్టోరేజ్ కోసం మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. 5,000mAh బ్యాటరీని అందించగా.. 15W ఛార్జింగ్‌తో USB 2.0 ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ కోసం ఇందులో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, FM రేడియో, USB-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. ఈ ఫోన్ బాడీ IP54 రేటింగ్ ఉన్నందున దుమ్ము, వాటర్ నుంచి కొంత వరకు సేఫ్‌గా ఉంటుంది. ఈ ఫోన్ జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ అనే రెండు కలర్స్‌లో రానుంది. అయితే ధరను అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter