Credit Card: స్కోర్ కి.. రిపోర్ట్ కి తేడా.. క్రెడిట్ కార్డ్ యూజర్స్ తప్పక తెలుసుకోవలసిన విషయం..

Credit score and report: మనకి లోన్ ఇవ్వాలి అన్న.. తదుపరి కొన్ని ముఖ్యమైన సర్వీసులు అందజేయాలి అన్న బ్యాంకు వారు ముందుగా చూసేది క్రెడిట్ స్కోర్ లేదా క్రెడిట్ రిపోర్ట్. మరి ఈ రెండు ఒకటేనా లేదా ఈ రెండిటి మధ్య తేడాలు ఏమన్నా ఉన్నాయా అనే విషయాన్ని ఒకసారి చూద్దాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2023, 08:04 PM IST
Credit Card: స్కోర్ కి.. రిపోర్ట్ కి తేడా.. క్రెడిట్ కార్డ్ యూజర్స్ తప్పక తెలుసుకోవలసిన విషయం..

Credit score : ప్రస్తుతం తరంలో క్రెడిట్ కార్డ్ వారని వారు ఎవరు చెప్పండి. ప్రతి ఒక్కరి జోబులో డబ్బులు ఉంటాయో లేదో తెలియదు కానీ క్రెడిట్ కార్డులు మాత్రం తప్పకుండా ఉండేలా అయిపోయింది. మనకు తరచుగా రోజు ఎవరో ఒకరు ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్ కావాలా అని అడుగుతారు.. మరి మనం కామ్ గా ఉండలేముగా.. అవసరం ఉన్నా లేకపోయినా ఎప్పుడో ఒకప్పుడు పనికొస్తుంది లే అన్నట్టుగా క్రెడిట్ కార్డులు తీసుకునేస్తూ ఉంటాం.

ఎవరో దగ్గర అప్పు చేసే బదులు.. మనకు ఎప్పుడు కావాలో అప్పుడు బ్యాంకులో అప్పు చేసేద్దాం లే అని క్రెడిట్ కార్డ్ జోబులో పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. అయితే దీనివల్ల మన పైన పదే అదనపు భారం మాత్రం మర్చిపోతూ ఉంటాం. కాగా ఈ విషయాలన్నీ పక్కన పెడితే క్రెడిట్ కార్డు కి సంబంధించిన కొన్ని పదాల అర్థం కూడా మనలో చాలామందికి తెలియదు. మనం క్రెడిట్ కార్డు కి సంబంధించి తరచుగా వినే పదాలు క్రెడిట్ కార్డ్ స్కోర్.. క్రెడిట్ కార్డ్ రిపోర్ట్. చాలామంది ఈ రెండు పదాలు కూడా ఒకటే అర్థం అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉంది. మరి వాటి మధ్య ఉన్న తేడా ఏమిటో ఒకసారి చూద్దాం.

క్రెడిట్ స్కోర్:

ప్రముఖ సంస్థలకైనా లేదా వ్యక్తిగత వారికైనా ఈ క్రెడిట్ స్కోర్ అనేది 300 నుంచి 900 మధ్య ఉండాలి. ఆ స్కోర్ ఆధారంగా మీకు రుణం ఇవ్వవచ్చో లేదో అనే విషయాన్ని బ్యాంకులు నిర్ణయిస్తాయి. అంటే మనం బ్యాంకు నుంచి లోన్ పొందాలి అంటే తప్పకుండా క్రెడిట్ స్కోర్ మంచిగా ఉండాలి. అంతేకాదు క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత ఎక్కువ రుణం పొందవచ్చు. ఈ క్రెడిట్ స్కోర్ తగ్గే కొద్దీ మనకి వచ్చే లోన్ అవకాశం అలానే వచ్చే లోన్ అమౌంట్ అనేది తగ్గుతూ వస్తుంది. మామూలుగా క్రెడిట్ స్కోర్ 700 కంటే ఎక్కువ ఉంటే మంచి క్రెడిట్ స్కోర్‌గా పరిగణిస్తారు.

అసలు ఈ క్రెడిట్ స్కోర్ ని బ్యాంకులు ఎలా కాలిక్యులేట్ చేస్తాయి అనుకుంటున్నారా… చాలా సింపుల్ మీ క్రెడిట్ కార్డ్ ఫైనాన్షియల్ లెక్కలను బట్టి వీటిని లెక్కేస్తాడు. ఇది లెక్కేయడానికి వారు పరిగణంలోకి తీసుకునే అంశాలు ఏమిటి అనగా .. క్రెడిట్ కార్డ్ వినయోగం.. పేమెంట్ హిస్టరీ.. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఆ క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నారు అనే సమాచారం…ఇటీవల తెరిచిన క్రెడిట్ ఖాతాల సంఖ్య అలానే క్రెడిట్ మిక్స్. ఇవన్నీ పరిగణంలోకి తీసుకొని మీ క్రెడిట్ స్కోర్ ని బ్యాంకు వారు నిర్ణయించి దాన్నిబట్టి మీకు రుణం అవకాశాన్ని అందజేస్తారు.

క్రెడిట్ రిపోర్ట్:

క్రెడిట్ రిపోర్టునే మనం క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని కూడా అంతు ఉంటాం. కాదా ఈ రిపోర్టు ఆధారంగానే క్రెడిట్ స్కోర్ ను క్యాలిక్యులేట్ చేస్తారు. సాధారణంగా మీ పూర్తి ఆర్థిక వ్యవహారాల సమచారం క్రెడిట్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. అనగా మీ పేరు పైన ఉన్న యాక్టివ్ లోన్స్, దరఖాస్తు చేసిన లోన్స్, క్రెడిట్ కార్డ్‌ల సంఖ్య,  ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాలు, మీ లోన్ రీపేమెంట్ హిస్టరీ.. అన్నీ కూడా ఈ రిపోర్టులో ఉంటాయి. కాగా ప్రతి ఒక్కరి క్రెడిట్ రిపోర్టులో ప్రధానంగా కనిపించే అంశాలు ఏమిటి అంటే .. మీ పేరుస. వయసు.. పాన్ నెంబర్.. అడ్రస్.. మొబైల్ నెంబర్.. ఈమెయిల్ అడ్రస్.. మీరు చేస్తున్న ఉద్యోగం.. ఇక ఈ పర్సనల్ విషయాలతో పాటు
 క్రెడిట్ స్కోర్ రుణాల చెల్లింపుల్లో జరిగిన జాప్యం, డీఫాల్ట్ రుణాలు.. క్రెడిట్ అకౌంట్ సమాచారం.. క్రెడిట్ ఎంక్వైరీ సమాచారం.. ఇవన్నీ కూడా క్రెడిట్ రిపోర్టులో ఉంటాయి.

కాగా క్రెడిట్ కార్డ్ యూజర్లకి క్రెడిట్ రిపోర్ట్ అలానే క్రెడిట్ స్కోర్ ఈ రెండు కూడా తరచుగా చెక్ చేసుకుంటూ ఉండటం చాలా అవసరం. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే మీకు తక్కువ వడ్డీతోనే లోన్ లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక లోన్ వచ్చేముందు రుణ దరఖాస్తుదారుల రుణ యోగ్యత, విశ్వసనీయతలను తెలుసుకోవడానికి బ్యాంకు వారు మీ క్రెడిట్ రిపోర్టులను చెక్ చేస్తారు. కాబట్టి ఈ రెండిటి మధ్య తేడా ఉన్న ఈ రెండు కూడా మీ ఫైనాన్షియల్ విషయాలను ఎక్కువ ప్రభావితం చేస్తాయి.

Also Read: BRS-BJP Alliance: హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్-బీజేపీ పొత్తు ఉంటుందా, అమిత్ షా ఏమంటున్నారు

Also Read: AB De Villiers Team: ఏబీ డివిలియర్స్ దృష్టిలో బెస్ట్ ప్రపంచకప్ టీమ్ ఇదే

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News