Smart Tv @ Rs 999: రూ. 999లకే Infinix Y1 43 ఇంచుల స్మార్ట్‌ టీవీ.. ఆఫర్ పరిమితకాలమే!

Cheap & Best 43 Inch Smart Tv: ఇన్‌ఫినిక్స్‌ కంపెనీ మరో స్మార్ట్‌ టీవీని విడుదల చేసింది. అయితే ఉగాది సందర్భంగా ఈ టీవీ చాలా తక్కువ ధరలో లభిస్తోంది. మీరు తక్కువ ధరలో స్మార్ట్‌ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2023, 08:52 AM IST
Smart Tv @ Rs 999: రూ. 999లకే Infinix Y1 43 ఇంచుల స్మార్ట్‌ టీవీ.. ఆఫర్ పరిమితకాలమే!

Get 43 Inch Smart Tv @ Rs 999: ప్రముఖ చైనా ఎలక్ట్రిక్ కంపెనీ ఇన్‌ఫినిక్స్‌ మొట్ట మొదటి సారిగా స్మార్ట్‌ ఫోన్‌ విడుదల చేసింది. ఇటీవలే ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌ కూడా మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే  మంచి బడ్జెట్‌లో రావడంతో మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగిపోయింది. అయితే ఈ ల్యాప్‌టాప్‌లో చాలా రకాల కొత్త ఫీచర్లు ఉండడం వల్ల మధ్యతరగతి వారు ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే ఇన్‌ఫినిక్స్‌ ఇటీవల స్మార్ట్‌ టీవీని కూడా మార్కెట్‌లోకి విడుదల చేసింది. భారతదేశంలో Infinix Y1 సిరీస్‌తో కస్టమర్ల ముందుకు తీసుకువచ్చారు.

ఈ టీవీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. ఒకటి 32 అంగుళాల వేరియంట్‌ అయితే.. రెండవది 43-అంగుళాలతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ ఉగాది సేల్‌ సందర్భంగా ఈ టీవీపై భారీ డిస్కౌంట్‌ను అందజేస్తోంది. ఆ డిస్కౌంట్‌ వివరాలేంటో, టీవీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్‌ఫినిక్స్‌ 32 అంగుళాల స్మార్ట్‌  టీవీ రూ. 7000 కంటే తక్కువ ధరతోనే మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ టీవీ 16W స్పీకర్లుతో అందుబాటులోకి వచ్చింది. దీంతో మీరు హోం థియోటర్‌ లాంటి సౌండ్‌ అనుభూతి పొందొచ్చు. Infinix స్మార్ట్ టీవీలో ప్రత్యేకత ఏమిటి? ధర,  ఫీచర్ల గురించి ఇప్పుడు మీరు తెలుసుకోండి.

డెడ్‌ చీఫ్‌గా ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్‌ టీవీ ధర:

Infinix Y1 స్మార్ట్‌టీవీ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్టులో మూడు వేరియంట్స్‌లో లభిస్తోంది.  109 cm (43 inch) వేరియంట్‌ ధర రూ. 15,499లకే వినియోగదారులకు అందుబాటులో ఉంది. మీరు దీని కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయాలనుకుంటే ఉగాది సేల్‌ కొనుగోలు చేస్తే పొందొచ్చు. అంతేకాకుండా మీరు SBI క్రెడిట్‌ కార్డుతో బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 1500 దాకా డిస్కౌంట్‌ లభించనుంది. దీంతో ఈ స్మార్ట్‌ టీవీ ధర రూ. 13,499కి తగ్గుతుంది. అంతేకాకుండా ఈ టీవీపై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. అయితే మీరు భారీగా డిస్కౌంట్‌ పొందాలనుకునేవారు మీ పాత స్మార్ట్‌ టీవీని ఎక్చేంజ్‌ చేసి దాదాపు రూ. 11,500 దాకా డిస్కౌంట్‌ పొందవచ్చు. దీంతో మీకు ఈ స్మార్ట్‌ టీవీ రూ. 1,999లకే లభిస్తుంది. మీరు EMI ఆప్షన్‌తో కొనుగోలు చేస్తే దాదాపు రూ. 1,000 దాకా తగ్గింపుతో మీరు ఈ టీవీ కొనుగోలు చేయోచ్చు. దీంతో ఈ స్మార్ట్‌ టీవీ ధర రూ. 999లు మాత్రమే కానుంది. మీరు డెడ్‌ ఛీప్‌గా ఈ ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్‌  టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం..

Infinix Y1 స్పెసిఫికేషన్‌లు :

  • 43 డిస్ప్లే HD రిజల్యూషన్ (1,366 x 768 పిక్సెల్స్)
  • డిస్ప్లే ప్యానెల్ 250 నిట్స్ బ్రైట్‌నెస్‌
  • HLG మద్దతు
  • టీవీలో ఐ కేర్ మోడ్
  • 16W ఆడియో అవుట్‌పుట్‌
  • డాల్బీ ట్యూన్ ఆడియో
  • 512MB ర్యామ్, 4GB స్టోరేజ్
  • టీవీలో ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన ప్రైమ్ వీడియో, యూట్యూబ్, సోనీలివ్, జీ5, ఈరోస్‌నౌ వంటి యాప్స్‌
  • HDMI పోర్ట్‌లు
  • రెండు USB పోర్ట్‌లు
  • RF ఇన్‌పుట్
  • హెడ్‌ఫోన్ జాక్
  • LAN, Wi-Fi కనెక్టివిటీ
  • 20Wకి బదులుగా 16W సౌండ్ అవుట్‌పుట్‌

Also Read: Heavy Rains: తెలుగు ప్రజలకు అలర్ట్, మరో 48 గంటలు కొనసాగనున్న వర్షాలు

Also Read: SSC GD Constable Recruitment 2023:ఎస్ఎస్‌సి కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య 50187కి పెంపు

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

Trending News