Havells Altima I70: రూ. 19,290 విలువగల కూలర్ కేవలం .7,500 రూపాయలకే..

తెలుగు రాష్ట్రాలు వర్షాలతో అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే వర్షాలు పడని సమయంలో తేమతో తెగ వేడిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీకు సహాయపడే ఒక మంచి కూలర్ ను అతి తక్కువ ధరకే తీసుకొచ్చాము. ఆ వివరాలు.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 11, 2023, 03:47 PM IST
Havells Altima I70: రూ. 19,290 విలువగల కూలర్ కేవలం .7,500 రూపాయలకే..

Havells Altima I70: చౌక ధరలో కూలర్ కొనే యోచనలో ఉన్నవారికి దిగ్గ‌జ ఈ కామ‌ర్స్ సంస్థ అమెజాన్ కూలర్‌పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. కొత్త‌గా కూల‌ర్ కొనాల‌నుకునేవారు ఈ ఆఫ‌ర్‌ను ఒక‌సారి ప‌రిశీలించ‌వ‌చ్చు. సగం క‌న్నా త‌క్కువ ధ‌ర‌కే ఎంచ‌క్కా కూల‌ర్‌ను మ‌న సొంతం చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా ఇందులో అదిరిపోయే ఫీచ‌ర్లు ఉన్నాయి. రిమోట్ ఫెసిలిటీ దీని ప్ర‌త్యేక‌త‌.

హవెల్స్ ఎల్టిమా ఐ70 
అమెజాన్  సూపర్ డీల్‌లో ఈ కూలర్‌పై భారీ తగ్గింపు ఉంది. ఇది డెజర్ట్ ఎయిర్ కూలర్. దీని కెపాసిటీ 70 లీటర్లు. కూల‌ర్‌కు మూడు వైపులా హనీకాంబ్ పాడ్స్ ఉంటాయి. ఐస్ చాంబర్ కూడా ఉంది. లో వాటర్ అలారం, వాటర్ లెవెల్ ఇండికేటర్, పవర్ ‌ఫుల్ ఎయిర్ డెలివరీ దీని సొంతం. పవ‌ర్ క‌ట్ స‌మ‌యంలో కూడా ఇన్వర్టర్ ద్వారా ఈ కూలర్ పని చేస్తుంది. 

రూ.7,500కే కొనొచ్చు..
ఈ కూలర్ ఎంఆర్‌పీ రూ. 19,290. అయితే మీరు దీన్ని ఇప్పుడు రూ. 8,999కే కోనుగోలు చేయొచ్చు. అంటే  53 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అలాగే ఈ కూలర్‌పై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ ఆప్షన్‌లో ఈ కూలర్ కొంటే అదనంగా రూ. 400 వరకు తగ్గింపు వస్తుంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే ఈ ఆఫర్ ఉంటుంది. అంటే రూ.7,500కే ఈ కూలర్ మ‌న సొంత‌మవుతుంది. ఇతర క్రెడిట్ కార్డులపై కూడా ఆఫర్లు ఉన్నాయి.

Also Read: Chandrababu Case: చంద్రబాబు కేసులో కీలక పరిణామాలు, అటు కస్టడీ, ఇటు బెయిల్‌పై ఉత్కంఠ

రూ.430 ఈఎంఐతో కొనండి!
ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఆరు నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. రెగ్యులర్ ఈఎంఐ అయితే నెలకు రూ. 436 నుంచి కట్టాలి. 24 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. అదే 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ.561 చెల్లించాలి. ఏడాది పాటు టెన్యూర్ అయితే నెలకు రూ. 808 పడుతుంది. 9 నెలల టెన్యూర్ అయితే రూ. 1100 పడుతుంది. 6 నెలల టెన్యూర్ అయితే రూ.1600, మూడు నెలల టెన్యూర్ అయితే రూ.3 వేల చెల్లించాలి.

Also Read: Chandrababu Case: రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు,స్నేహ బ్లాక్ ఖైదీ నెంబర్ 7691

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News