Mobile Banking Virus: మీ ఖాతాల్ని ఖాళీ చేసే కొత్త మొబైల్ బ్యాంకింగ్ ట్రోజన్ వైరస్, ఎలా పనిచేస్తుంది, రక్షణ ఎలా

Mobile Banking Virus: సైబర్ నేరాల్లో ఇప్పుడు కొత్తగా మొబైల్ బ్యాంకింగ్ వైరస్ విస్తరిస్తోంది. కస్టమర్లను టార్గెట్ చేస్తూ విస్తరిస్తున్న ఈ మొబైల్ బ్యాంకింగ్ ట్రోజన్ వైరల్ ఆందోళన రేపుతోంది. ఖాతాల్ని ఖాళీ చేస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 15, 2022, 10:00 PM IST
Mobile Banking Virus: మీ ఖాతాల్ని ఖాళీ చేసే కొత్త మొబైల్ బ్యాంకింగ్ ట్రోజన్ వైరస్, ఎలా పనిచేస్తుంది, రక్షణ ఎలా

Mobile Banking Virus: సైబర్ నేరాల్లో ఇప్పుడు కొత్తగా మొబైల్ బ్యాంకింగ్ వైరస్ విస్తరిస్తోంది. కస్టమర్లను టార్గెట్ చేస్తూ విస్తరిస్తున్న ఈ మొబైల్ బ్యాంకింగ్ ట్రోజన్ వైరస్ ఆందోళన రేపుతోంది. ఖాతాల్ని ఖాళీ చేస్తోంది. 

సాంకేతికత, సౌకర్యాలు వృద్ధి చెందే కొద్దీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఊహించని విధానాల్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు కొత్తగా మొబైల్ బ్యాంకింగ్ వైరల్ విస్తరిస్తోంది. కస్టమర్ల ఖాతాల్ని టార్గెట్ చేస్తూ..మొబైల్ బ్యాంకింగ్ ట్రోజన్ వైరస్ అనేది ఆండ్రాయిడ్ ఫోన్ ఫైల్‌కు నష్టం కల్గిస్తుంది. ఫలితంగా ఆర్ధికంగా నష్టపరుస్తుంది. ఖాతాను సులభంగా ఖాళీ చేసేస్తుంది. ఒకసారి మీ మొబైల్‌లో ఈ వైరస్ చొరబడిందంటే..తొలగించడం కూడా కష్టమే.

భారతీయ సైబర్ రంగంలో జూలై నెలలో తొలిసారిగా ఈ వైరస్ గురించి తెలిసింది. ప్రస్తుతం ఈ వైరస్ 5వ జనరేషన్ నడుస్తోంది. దేశంలోని బ్యాంకు కస్టమర్లను కొత్త సర్వీస్ ఆండ్రాయిడ్ ట్రోజన్ ద్వారా టార్గెట్ చేస్తోందని తెలుస్తోంది. ఇందులో మొబైల్ బ్యాంకింగ్‌ను టార్గెట్ చేస్తారు. ఈ మాల్‌వేర్ తొలి వెర్షన్ 2021 సెప్టెంబర్ నెలలో మార్కెట్‌లో విక్రయం కోసం ప్రవేశపెట్టారు. లాగింగ్ చేసేటప్పుడు పేరు, పాస్‌వర్డ్, కుకీస్ దొంగిలిస్తుంది. 

ఈ మాల్‌వేర్ కొత్త కస్టమర్లను మోసం చేసేందుకు డూప్లికేట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లో దాగి ఉంటుంది. ఆ తరువాత క్రోమ్, అమెజాన్, ఎన్ఎఫ్‌టి వంటి ప్రాచుర్యం కలిగిన యాప్స్‌లో కన్పిస్తుంది. ప్రముఖ కంపెనీల పేరుతో ఎస్ఎంఎస్‌లు పంపించడం ద్వారా మోసం చేసేందుకు ప్రయత్నిస్తుంది ఈ వైరస్.

ఒకసారి ఫోన్‌లో డూప్లికేట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసిన తురవాత..టార్గెట్ చేసిన అప్లికేషన్ల వివరాలు పొందేందుకు మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసిన అన్ని అప్లికేషన్ల వివరాలను కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్‌కు పంపిస్తుంది. సైబర్ నేరగాళ్లు ఈ సర్వర్‌ను కంట్రోల్ చేస్తుంటారు.

కీ స్ట్రోక్‌ను సైతం ప్రభావితం చేస్తుందంటే ఈ మొబైల్ బ్యాంకింగ్ ట్రోజన్ వైరస్ ఎంత ప్రమాదకరమో అంచనా వేయవచ్చు. వెరిఫికేషన్‌కు సంబంధించిన వివిధ కారణాల్ని పసిగడుతుంది. స్క్రీన్ షాట్ తీయగలదు. వెబ్‌క్యామ్ నుంచి వీడియో రికార్డ్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లను మోసం చేసేందుకు 200 కంటే ఎక్కువ బ్యాంకింగ్, పేమెంట్ యాప్స్‌ను డూప్లికేట్ చేస్తుంది. 

వైరస్ నుంచి రక్షణ ఎలా

కస్టమర్లు ఎప్పుడూ వివిధ యాప్స్‌ను యాప్‌స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు యాప్ గురించి సమీక్షిస్తుండాలి. ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఆండ్రాయిడ్ యాప్‌ను అప్‌డేట్ చేస్తుండాలి. ఈ మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్స్‌పై ఎప్పుడూ క్లిక్ చేయకూడదు.

Also read: IRCTC Ticket Booking: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్, ఇకపై చాట్ బోట్ ద్వారా టికెట్ బుకింగ్ సౌకర్యం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News