Apple Update: యాపిల్ మొబైల్స్‌ కస్టమర్స్‌కి శుభవార్త.. కొత్త 2024 అప్‌డేట్‌ వచ్చేసింది..

Apple Update: యాపిల్ కంపెనీ తమ కస్టమర్స్‌కి శుభవార్త తెలిపింది. కంపెనీ Apple iOS 17.5 అప్‌డేట్‌ను లాంచ్‌ చేసింది. అయితే ఈ అప్‌డేట్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 16, 2024, 12:53 PM IST
Apple Update: యాపిల్ మొబైల్స్‌ కస్టమర్స్‌కి శుభవార్త.. కొత్త 2024 అప్‌డేట్‌ వచ్చేసింది..

 

Apple Update In Telugu: యాపిల్ కంపెనీ తమ యూజర్స్‌కి గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ఇటీవలే Apple iOS 17.5లో పెద్ద అప్‌డేట్‌ను లాంచ్‌ చేసింది. ఇందులో భాగంగా కస్టమర్స్‌ అద్భుతమైన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ పొందుతారు. కంపెనీ ఈ ఆప్డేట్‌ను కేవలం యూరోపియన్ యూనియన్ దేశాలకు మాత్రమే అందించింది. గత కొన్ని సంవత్సరాలుగా Apple iOS 17.5 అప్‌డేట్‌ యాపిల్ అనేక పరీక్షలు నిర్వహించి ఇటీవలే తమ కస్టమర్స్‌కి అందించింది. ఈ అప్‌డేట్‌ను నేరుగా  డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసి సెటప్‌ చేసుకోవచ్చు. అయితే ఈ కొత్త అప్‌డేట్‌లో వచ్చిన మార్పులు ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

iOS 17.5 అప్‌డేట్‌ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
1. వెబ్‌సైట్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:

యాపిల్ యూరోపియన్ యూనియన్ కస్టమర్స్‌కి అద్భుతమైన ఫీచర్‌ను అందిస్తోంది. అయితే ఇంతకముందు కేవలం యాప్‌ స్టోర్‌లోనే డౌన్‌లోడ్‌ చేసుకుని ఆప్షన్‌ ఉండేది. కానీ ఈ ప్రత్యేకమై అప్‌డేట్‌తో ఇతర వెబ్‌సైట్‌ల నుంచి కూడా యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇతర ఫైల్స్‌ను కూడా డౌన్‌లోడ్‌ చేసుకునే ప్రత్యేకమైన సదుపాయాన్ని అందిస్తోంది. 

2. రిపేర్ స్టేట్ మోడ్:
ప్రస్తుతం చాలా మంది ఐఫోన్‌ను రిపేర్ కోసం ఇస్తున్నప్పుడు ఫైండ్ మై ఆఫ్ చేసి ఇస్తూ ఉంటారు. దీని కారణంగా ఆ సమయంలో ఎవరైన మొబైల్‌ను దొంగిలించినప్పుడు ఫోన్‌ దొరకకపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక నుంచి రిపేర్ స్టేట్ మోడ్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌ను వినియోగించి సులభంగా రీకవరీ చేసుకోవచ్చు. 

3. Apple News+ ఆఫ్‌లైన్ మోడ్
యాపిల్ కంపెనీ  Apple News+ ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా సబ్‌స్క్రిప్షన్‌ కంటెంట్‌ను కూడా ఆఫ్‌లైన్‌లో చదవచ్చు. దీంతో పాటు ఇతర సబ్‌స్క్రిప్షన్‌కు సంబంధించిన వివిధ రకాల కంటెంట్‌ను ఫ్రీగా చూసే ఛాన్స్‌ కూడా ఉంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

5. iPhoneని ఎలా అప్‌డేట్ చేయాలి?
iOS 17.5కి అప్‌డేట్ చేయాలనుకుంటున్నారా? ఇలా చేయండి..
1. ఈ అప్‌డేట్ చేయడానికి మీ ఐఫోన్ సెట్టింగ్స్‌కి వెళ్లాల్సి ఉంటుంది.

2. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

3. ఇలా చేసిన తర్వాత స్క్రీన్‌పై కొత్త అప్‌డేట్ వస్తుంది.

4. దీంతో మీకు 6-అంకెల పాస్‌వర్డ్‌ను టైప్‌ చేసి, ఇన్‌స్టాల్‌ ఆప్షన్‌ను నొక్కాలి.

5. దీని తర్వాత మీ ఐఫోన్ iOS 17.5 అప్‌డేట్ అవుతుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News