50 Years for Mobile Phones: 'మొబైల్ ఫోన్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ప్రపంచాన్ని అరచేతిలో చూపిస్తుంది. ప్రపంచ నలుమూలల్లోని ఏ న్యూస్ అయినా నిమిషాల్లో తెలుస్తుంది. ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. కొందరు అయితే 2-3 కూడా మెయింటైన్ చేస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే.. ప్రస్తుత రోజుల్లో మొబైల్ లేనిదే జనాలకు నిమిషం గడవదు. పడుకునే సమయంలో కూడా ఫోన్ పక్కనే పెట్టుకుంటున్నారు అంటే.. ఎంతలా అడిక్ట్ అయ్యారో యిట్టే అర్ధం చేసుకోవచ్చు.
ప్రస్తుతం మొత్తం 'ఇంటర్నెట్' మయం అయింది. ఫోటోస్, వీడియోస్, మనీ ట్రాన్స్ఫర్, సినిమా, క్రికెట్.. పని ఏదైనా ఇంటర్నెట్ ద్వారా నిమిషాల్లో పని అయిపోతుంది. అందుకే మొబైల్ వాడకం కూడా భారీ సంఖ్యలో పెరిగింది. ఇటీవలి ఓ సర్వే ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 3.8 బిలియన్ల కంటే ఎక్కువ మంది మొబైల్ వినియోగదారులు ఉన్నారట. వచ్చే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేయబడింది. అయితే మొబైల్ ఫోన్ వచ్చి 50 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకుందాం.
మొబైల్ ఫోన్ మొదటలో చాలా పెద్దదిగా ఉండేది. బరువు 2.5 పౌండ్లు, ధర 3995 డాలర్లు ఉండేది. రాను రాను ఇది కమ్యూనికేషన్‌లో గణనీయమైన పురోగతిని సాధించింది. అదే క్రమంలో అధునాతన మొబైల్ గాడ్జెట్‌లను రూపొందించడానికి బీజం పడింది. 1983లో మోటోరోలా (Motorola DynaTAC 8000X) మొట్టమొదటి మొబైల్ ఫోన్‌ను విడుదల చేసింది. మోటరోలా ఇంజనీర్ మార్టిన్ కూపర్ 1973 ఏప్రిల్ 3న మొదటి మొబైల్ ఫోన్ కాల్ చేసారు. దాంతో మొబైల్ ఫోన్‌లకు 50 ఏళ్లు నిండాయి.
ప్రస్తుతం ఫోన్‌లపై ఆధారపడటంతో పాటు వాటితో సంబంధం బాగా పెరిగింది. అయితే అధిక ఫోన్ వినియోగం మన మానసిక ఆరోగ్యం, శ్రేయస్సును దెబ్బతీస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే చాలా మంది ఫోన్‌లు లేకుండా ఉండలేరు. ఎందుకంటే మొబైల్ ఫోన్‌లు మనకు అందించిన ప్రయోజనాలు అలాంటివి. మన దైనందిన జీవితంలో మొబైల్ ఫోన్‌లపై ఆధారపడటం తప్పదు కాబట్టి.. అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు వినియోగాన్ని తగ్గిస్తే మంచిది. పడుకునే ముందు అయినా కనీసం మొబైల్‌ను దూరంగా పెడితే కాస్త శ్రేయస్కరం. ఏదేమైనా సెల్‌ఫోన్ 50వ పుట్టినరోజు సందర్భంగా అభినందిద్దాం. ఈ సేవలు మరింత ముందుకు సాగాలని ఆశిద్దాం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.