One Nation One Election: తాజాగా మరోసారి జమిలి ఎన్నికల ప్రస్తావన తెరమీదకి వచ్చింది. అయితే ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయా.. వచ్చే సార్వత్రిక ఎన్నికలు అలాగే జరగనున్నాయా.. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా స్పందించారు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో బీహార్ ఎన్నికల (Bihar Assembly Elections) పై నెలకొన్న సందిగ్ధత వీడింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను శుక్రవారం ప్రకటించింది. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం (CEC) వెల్లడించింది.
అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ట్యాంపరింగ్ వంటి అక్రమాలకు వీల్లేదని, ఇకపై భవిష్యత్తులో ఈవిఎంల ద్వారానే ఓటింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా మరోసారి స్పష్టం చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ముఖ్యమైన తేదీలను వెల్లడించిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ అరోరా. ఫిబ్రవరి 8న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించి.. పిబ్రవరి 11న ఫలితాలు వెల్లడించనున్నట్టు ప్రకటించిన సీఇసీ. జనవరి 14న ఢిల్లీ ఎన్నికలపై నోటిఫికేషన్ వెలువడనుండగా.. జనవరి 21న నామినేషన్స్ దాఖలుకు తుది గడువు విధించినట్టు సీఈసి స్పష్టంచేసింది. జనవరి 22న నామినేషన్స్ పరిశీలన చేపట్టనుండగా జనవరి 24న నామినేషన్స్ ఉపసంహరణకు ఆఖరి గడువు విధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.