పాకిస్తాన్ కుట్ర మరోసారి బయటపడింది. జమ్మూకాశ్మీర్లోని భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో 150 మీటర్ల పొడవైన భూగర్భ సొరంగాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. ఆర్మీ ఆపరేషన్లో భాగంగా.. జమ్మూకాశ్మీర్లోని సాంబా సెక్టార్లో దీనిని కనుగొన్నట్లు డీజీపీ దిల్బాగ్ సింగ్ ఆదివారం తెలిపారు.
Pakistan's Federal Minister Fawad Choudhry about Pulwama attack: న్యూ ఢిల్లీ: పుల్వామా దాడిలో 40 మందికిపైగా సీఆర్పీఎఫ్ బలగాలను పాక్ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ( Pakistan terrorists ) జరిపిన ఈ ఆత్మాహుతి దాడిని యావత్ ప్రపంచం ఖండించింది. ఐతే ఈ దాడితో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ ( Pakistan ) ఇప్పటివరకు వాదిస్తూ వస్తోంది.
అయోధ్యలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్కి చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ కుట్రపన్నుతున్నట్టు భారత నిఘావర్గాలు పసిగట్టాయి. జీ హిందుస్తాన్కి అందిన సమాచారం ప్రకారం.. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజార్ భారత్లో ఉన్న తమ ఉగ్రవాదులకు టెలిగ్రామ్ చాటింగ్ యాప్లో పంపించిన సందేశాన్ని దానిని భారత నిఘావర్గాలు గుర్తించినట్టు తెలుస్తోంది.
కశ్మీర్లో ఉగ్రవాద దాడులకు పాల్పడుతూ కవ్వింపు చర్యలకు దిగుతున్న పాకిస్తాన్కి చెందిన ఐఎస్ఐ తాజాగా నేపాల్లో ఓ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసుకుంది. అక్కడి నుంచే కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేలా కంట్రోల్ రూమ్ని తీర్చిదిద్దుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.