Telangana Bypoll Elections Result 2022: తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా కాక రేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైంది. మొత్తం 15 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. మునుగోడులో మొత్తం 241805 ఓట్లర్లు ఉండగా.. 225192 మంది ఓటేశారు. మరో 658 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Munugode Bypoll: రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం సాగుతుండగానే.. అదే మండల జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. తన అనుచరులతో సమావేశమై అధికార పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.కర్నాటి బాటలోనే ఇటీవల బీజేపీలో చేరిన మరికొంత మంది నేతలు తిరిగి అధికార పార్టీలోకి వస్తారనే ప్రచారం సాగుతోంది
Munugode Bypoll: తెలంగాణ రాజకీయాలన్ని మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. మునుగోడులో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి.
Jagadish Reddy: జగదీశ్ రెడ్డి.. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి. గత ఎనిమిదేళ్లుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏకచక్రాధిపత్యం వహిస్తున్నారు. అయితే జగదీశ్ రెడ్డి ఆహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి.
Munugode Bypoll: అనుకున్నది ఒక్కటి.. అవుతున్నది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా అన్నట్లుగా తయారైంది ఉప ఎన్నిక జరగనున్న మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి. జోరుగా సాగిన వలసలే కమలం పార్టీలో కుంపటి రాజేస్తోంది. కొత్తగా చేరిన నేతలతో పాత నేతలతో వార్ మొదలైంది.
Munugode Bypoll: మునుగోడు టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి ఓ రేంజ్ లో ఉంది. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కు వ్యతిరేకంగా తీన్మానం చేసేవరకు వెళ్లింది. కాంగ్రెస్ లోనూ టికెట్ లొల్లి కొనసాగుతోంది. పాల్వాయి స్రవంతి ఆడియా లీకై వైరల్ గా మారింది. తాజాగా కమలం పార్టీలోనూ ముసలం పట్టినట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.