Munugode Bypoll: మునుగోడులో బీజేపీ దూకుడు.. టీఆర్ఎస్ బేజారు! మంత్రి జగదీశ్ రెడ్డికి కేసీఆర్ క్లాస్...

Munugode Bypoll:  తెలంగాణ రాజకీయాలన్ని మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. మునుగోడులో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి.

Written by - Srisailam | Last Updated : Sep 24, 2022, 01:57 PM IST
  • మునుగోడులో బీజేపీ దూకుడు
  • పార్టీ మారుతున్న టీఆర్ఎస్ లీజర్లు
  • మంత్రి జగదీశ్ రెడ్డికి కేసీఆర్ క్లాస్
Munugode Bypoll: మునుగోడులో బీజేపీ దూకుడు.. టీఆర్ఎస్ బేజారు! మంత్రి జగదీశ్ రెడ్డికి కేసీఆర్ క్లాస్...

Munugode Bypoll:  తెలంగాణ రాజకీయాలన్ని మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. మునుగోడులో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి.  కాషాయ కండువా కప్పుకుంటూ  కారు పార్టీకి షాకిస్తున్నారు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు. మంత్రి జగదీశ్ రెడ్డి వెంట రోజంతా తిరుగుతున్న నేతలు.. రాత్రికి రాత్రే జెండా మార్చేస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో రోజురోజుకు బీజేపీలో జోష్ పెరుగుతుండగా... అధికార పార్టీలో మాత్రం ఆందోళన పెరిగిపోతుందని తెలుస్తోంది.

వలసలతో జోరు మీదున్న బీజేపీ మునుగోడులో మరింత జోరు దూకుడు పెంచింది. ఉప ఎన్నిక కోసం హైకమాండ్ ఏర్పాటు చేసిన హైకమాండ్ సమావేశమై ప్రచార వ్యూహం రూపొందించింది. స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ ఆధ్యక్షతన జరిగిన సమావేశానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గంగడి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. మునుగోడు లో ప్రచార వ్యూహంపై చర్చించారు. దసరా తర్వాత మునుగోడులో గడప గడపకు బిజేపీ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి గ్రామంలో పాదయాత్ర ద్వారా ఓటర్లను పలకరించనున్నారు. లక్ష ఓట్లు టార్గెట్ గా ప్రచారం చేయబోతున్నారు కమలనాధులు.

బీజేపీకి వలసలు కొనసాగుతుండటంతో అధికార పార్టీలో కలవరం కనిపిస్తోంది. మంత్రి జగదీశ్ రెడ్డి అభయం ఇస్తున్నా నేతలు ఎందుకు పార్టీ వీడుతున్నారన్నది అర్ధం కావడం లేదని తెలుస్తోంది. మునుగోడుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న సీఎం కేసీఆర్ పార్టీ గెలుపు అవకాశాలపై ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. రోజు రోజుకు పార్టీ పరిస్థితి దిగజారుతుందన్న సర్వే నివేదికలతో.. ఉప ఎన్నిక బాధ్యతలు చూస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నా ఆశించిన ఫలితం రావడం లేదని చెప్పారట. ప్రజా ప్రతినిధులు బీజేపీలో చేరకుండా ఎందుకు ఆపలేకపోతున్నారని మంత్రిపై మండిపడ్డారని టీఆర్ఎ్ వర్గాల సమాచారం.  

మునుగోడు నియోజకవర్గం హైదరాబాద్ కు దగ్గరలో ఉంటుంది. మునుగోడుకు సంబంధించి 40 నుంచి 50 వేల మంది ఓటర్లు హైదరాబాద్ లో ఉంటారు. ఈ ఓట్ల విషయంలో జిల్లా టీఆర్ఎస్ నేతలు పూర్తిగా విఫలమయ్యారనే భావననలో కేసీఆర్ ఉన్నారంటున్నారు. కొన్ని రోజుల క్రితమే అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లో ఉంటున్న మునుగోడు ఓటర్ల కోసమే ఆ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి వేలాది మంది ఓటర్లు హాజరయ్యారని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి సమావేశానికి సంబంధించిన వివరాలను ఇంటిలిజెన్స్  కేసీఆర్ కు నివేదించిదట. ఇలాంటి సమావేశం ఎందుకు పెట్టలేదని మంత్రి జగదీశ్ రెడ్డికి కేసీఆర్ క్లాస్ పీకారని తెలుస్తోంది. ఉప ఎన్నికలో ప్రతి ఓటు కీలకమైనప్పుడు.. వేలాది మంది వలస ఓటర్ల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని నిలదీశారట. మునుగోడులో రాజకీయ సమీకరణలు మారిపోతుండటంతో స్థానిక నేతల తీరుపై గుర్రుగా ఉన్న కేసీఆర్.. క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు అందించాలని నిఘా బృందాలను ఆదేశించారని తెలుస్తోంది.

Also Read: Jagadish Reddy: బీజేపీ నేతలను బట్టలిప్పి కొడతా.. ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి బూతు పురాణం..  

Also Read:  Bala krishna On NTR: పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త.. సీఎం జగన్ కు బాలయ్య వార్నింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News