Night curfew in Andhra Pradesh: విజయవాడ: ఏపీలో రోజురోజుకు భారీ సంఖ్యలో పెరిగిపోతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులను కట్టడి చేసేందుకు ఏపీ సర్కారు కూడా ఇతర రాష్ట్రాల తరహాలోనే కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 24వ తేదీ, శనివారం నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని (Minister Alla Nani) ప్రకటించారు.
Coronavirus alert: కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, తీసుకోవల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు.
ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడి ( Ap Opposition leader Chandrababu ) పైశాచిక ఆనందంలో ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ( Health Minister Alla nani ) ఆళ్లనాని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతి పది సెకన్లను ఒకరు కరోనా కారణంగా చనిపోతున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి నాని తీవ్రంగా స్పందించారు.
ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు ( Good news to unemployed ). వైద్య, ఆరోగ్య శాఖలో 9700 ఖాళీలను భర్తీ చేసేందుకు వారం రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు ( Jobs in health dept). వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ కోసం వేచిచూస్తున్న వారికి ఇది నిజంగానే ఓ గుడ్ న్యూస్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.