తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ పదవికి ప్రొఫెసర్ కోదండరామ్ ఈ రోజు రాజీనామా చేశారు. అయితే తన పార్టీ తెలంగాణ జనసమితికి ఈ సంస్థతో అనుబంధం ఎప్పుడూ ఉంటూనే ఉంటుందని.. వారితో కలిసి పనిచేస్తానని ఆయన చెప్పారు.
తెలంగాణ సాధించామని డబ్బాకొట్టుకోవడం తప్పితే ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోదండరాం విమర్శించారు. హైదరాబాద్లోని సరూర్నగర్లో 'కొలువులకై కొట్లాట' సభలో టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం కేసీఆర్, ఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు భూముల దందా, కాంట్రాక్టుల మీద చూపిస శ్రద్ధ యువతకు కొలువులు ఇచ్చే విషయంలో ఉండటం లేదని విమర్శించారు. మన ముఖ్యమంత్రి..మంత్రులకే అందుబాటులో ఉండటం లేదు..ఇక ప్రజలకు ఏం అందుబాటులో ఉంటారని ఎద్దేవ చేశారు. సచివాలయానికి వచ్చే తీరిన సీఎం కేసీఆర్ కు లేదని కోదండరాం విమర్శించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.