మూడుసార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించడం మాత్రమే కాకుండా పరుగు పందెంలో దాదాపు అన్ని రికార్డులను కూడా తిరగరాసిన మేటి ఆటగాడు ఉసేన్ బోల్ట్ అనడంలో సందేహం
లేదు.
ఫుట్‌బాల్‌ను ఒక వరల్డ్ కప్ స్థాయిలో ఆడడం భారత్‌కు తీరని కోరికేనా.. అంటే ఒకసారి ఎవరైనా ఆలోచించాల్సి వస్తుంది. అలాగని భారత్‌లో ఫుట్‌బాల్ అభిమానులు లేరని కాదు.. చాలామంది ఉన్నారు.. ఒక పశ్చిమ బెంగాల్లోనే చూసుకుంటే మోహన్ బగాన్ లాంటి క్లబ్బులు ఫుట్‌బాల్ అంటే ప్రాణం ఇస్తాయి. క్రికెటర్ సౌరభ్ గంగూలీకి కూడా ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం. అతను ఒకప్పుడు ఫుట్‌బాల్ ఆటగాడు కూడా. ఫుట్‌బాల్ విషయంలో మనకంటూ ఒక ఘన చరిత్ర ఉంది. 1951, 1962 ఆసియన్ గేమ్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు స్వర్ణం గెలుచుకుంది. కానీ ఆ తర్వాతే పరిస్థితి మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.