తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్ద షాక్ తగిలింది. సీనియర్ నేత జీవన్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు గెలిచిన జీవన్‌రెడ్డికి ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. హోరాహోరీ పోరులో జీవన్‌రెడ్డిపై సంజయ్ విజయం సాధించారు. తాజా ఓటమితో జీవన్‌రెడ్డి వరుస గెలుపు రికార్డుకు బ్రేక్ పడింది.
తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం వెల్లడైంది. చాంద్రాయణ గుట్ట ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు. తాజా విజయంతో ఆయన వరుగా ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లయింది. గతంతో ఆయన 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలుపొందుతూ వచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ జోరు కొనసాగుతుంది. స్పష్టమైన మెజార్టీ దిశగా గులాబీదళం దూసుకువెళ్తోంది. ప్రస్తతం టీఆర్ఎస్ 95 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా .. కాంగ్రెస్ 17 స్థానాలు బీజేపీ 3 స్థానాలు ఎంఐఎం 5 స్థానాలు ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. తాజా పరిణామాలతో టీఆర్ఎస్ శ్రేణుల్లో సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుటి వరకు అందిన సమాచారం ప్రకారం తొలిరౌండ్ ముగిసే సమయానికి పలువురు ముఖ్యనేతలు వెనుకంజలో ఉన్నారు
* నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి వెనుకంజ
* కూకట్‌పల్లిలో కాంగ్రెస్ అభ్యర్ధి సుహాసిని వెనుకంజ
* మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్ధి సబితా ఇంద్రారెడ్డి వెనుకంజ
* మదిరలో కాంగ్రెస్ అభ్యర్ధి భట్టి విక్రమార్క వెనుకంజ
తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుటి వరకు అందిన సమాచారం ప్రకారం తొలిరౌండ్ ముగిసే సమయానికి పలువురు ముఖ్యనేతలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
* సిద్ధిపేటలో టీఆర్ఎస్ అభ్యర్ధి హరీశ్ రావు ఆధిక్యం
* కొండగల్ లో కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్ రెడ్డి ఆధిక్యం
* మహేశ్వరంతో కాంగ్రెస్ అభ్యర్ధి సబిత ఆధిక్యం
* మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యం
* ములుగులో కాంగ్రెస్ అభ్యర్ధి సీతక్క ఆధిక్యం
* సత్తుపలిల్లో టీడీపీ అభ్యర్ధి సండ్రా వెంకట వీరయ్య ఆధిక్యం
2019 లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు సెమీఫైనల్ గా భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫలితాలను బట్టి వచ్చే ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఫలితాల ఎలా ఉండబోతాయనేది ఓ అంచనా వేయవచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్ గఢ్ ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో సెమీస్ ఫైనల్ లో నెగ్గేదెవరు తేలిపోనుంది.
కాంగ్రెస్ పార్టీ మేఘాలయలో ఆధిక్యత కనబరుస్తున్నప్పటికీ నాగాలాండ్, త్రిపురలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కనీసం ఒక్కసీటు కూడా సాధించని స్థితిలో నిలబడింది హస్తం పార్టీ. గత ఎన్నికల్లో త్రిపురలో 10 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్... ఇప్పుడు ఒక్క స్థానాన్ని కూడా గెలవలేని దారుణ పరిస్థితిలో ఉండడం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.