నేడే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ; సెమీస్ ఫైనల్ లో నెగ్గేదెవరు ? 

Last Updated : Dec 11, 2018, 07:14 AM IST
నేడే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ; సెమీస్ ఫైనల్ లో నెగ్గేదెవరు ? 

2019 లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు సెమీఫైనల్ గా భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫలితాలను బట్టి వచ్చే ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఫలితాల ఎలా ఉండబోతాయనేది ఓ అంచనా వేయవచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్ గఢ్ ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో సెమీస్ ఫైనల్ లో నెగ్గేదెవరు తేలిపోనుంది.

తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు, మధ్యప్రదేశ్ లో 230 స్థానాలు రాజస్థాన్ లోని 199 అసెంబ్లీ స్థానాలు, ఛత్తీస్ గఢ్ లో 90 అసెంబ్లీ స్థానాలు, మిజోరాంలో 40 అసెంబ్లీ స్థానాల్లో ఫలితాలు తేలనున్నాయి. ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రాంరంభమౌతుంది. ఇందుకోసం కౌటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నియంత్రించేందుకు ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు

Trending News