AP CM Jagan's Review Meeting on COVID-19 Cases: కొవిడ్-19 కేసులు మరోసారి పెరుగుతున్నందున ఏపీ సీఎం వైఎస్ జగన్ తాజాగా కొవిడ్ పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనావైరస్ లేటెస్ట్ వేరియంట్స్‌ను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్ ఆరా తీశారు. ఇకపై తీసుకోవాల్సిన చర్యలపై కూడా సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఇలా ఉన్నాయి..
ఏపీలో గత 24 గంటల్లో 70,521 మందికి కరోనావైరస్ పరీక్షలు ( Coronavirus tests ) నిర్వహించగా అందులో 5,145 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య మొత్తం 7,44,864 గా చేరింది. కరోనా నుంచి గత 24 గంటల్లో 6,110 మంది కోలుకోగా అలా ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య మొత్తం 6,91,040గా ఉంది.
COVID-19 cases in AP | అమరావతి: ఏపీ వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు (Good news to unemployed). ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు వెంటనే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ( Job notification) ఇవ్వాల్సిందిగా ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి చెప్పారు.
ఏపీలో కరోనావైరస్ కాటుకు మరొకరు బలయ్యారు. విజయనగరం జిల్లా ( Vizianagaram district ) బలిజపేట మండలం చిలకలపల్లికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు కరోనాతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తీవ్ర అనారోగ్యం పాలైన వృద్ధురాలు విశాఖలోని విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో డయాలసిస్ ( Dialysis VIMS ) చికిత్స తీసుకుంటున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తించకుండా నివారించడం కోసం కేంద్రం మరోసారి లాక్‌డౌన్‌ని మే 17వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. మూడోసారి లాక్‌డౌన్‌ని పొడిగిస్తూ నేడు ఆదేశాలు జారీచేసిన కేంద్ర హోంశాఖ.. మే 17వ తేదీ వరకు అందుబాటులో ఉండే సేవల వివరాలు వెల్లడిస్తూ పలు మార్గదర్శకాలు సైతం జారీచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.