PUBG mobile app latest updates: PUBG Mobile india తో పాటు మరో 118 ఇతర చైనీస్ మొబైల్ యాప్స్‌పై భారత్‌లో ఇప్పటికీ నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2020 సెప్టెంబరు నుండి చైనా మొబైల్ యాప్స్ విషయంలో భారత్ వైఖరిలో మార్పు లేదు.
పబ్జి గేమ్ కోసం పబ్జి లవర్స్ అంతా వేయి కళ్లతో వేచిచూస్తున్నారు. కానీ పబ్జి గేమ్ ( PUBG game in India ) దేశంలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని అడిగితే మాత్రం ఎవరిదగ్గరా సరైన సమాధానం లేదు.
టిక్ టాక్ యాప్‌పై ( TikTok App ) భారత్ నిషేధం విధించడంతో ఆ యాప్‌ని అభివృద్ధి చేసి భారత్‌పైకి వదిలిన చైనా కంపెనీ బైట్ డ్యాన్స్ ( Bytedance ) విలవిలలాడుతోంది. చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్‌ని భారత్ నిషేధించగా ( 59 chinese apps banned ).. అందులో బైట్ డ్యాన్స్‌కి చెందిన యాప్స్ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.
ప్రజల భద్రత, వ్యక్తిగత స్వేచ్ఛ దృష్ట్యా చైనా యాప్ టిక్‌టాక్‌పై నిషేధం విధించాలన్న డిమాండ్ అమెరికాలో పెరుగుతోంది. ఈ మేరకు 25 మంది కాంగ్రెస్ సభ్యులు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు విజ్ఞప్తి చేయడం గమనార్హం.
గాల్వన్ లోయలో ఉద్రిక్తత అనంతరం చైనాకు డిజిటల్ సర్జికల్ స్ట్రైక్స్‌తో కేంద్ర ప్రభుత్వం బుద్ధి చెప్పింది. 59 చైనా యాప్‌లపై నిషేధం (India's Decision Over TikTok) విధించడం తెలిసిందే.
లడఖ్‌లోని గాల్వన్ లోయలో హింసాత్మక ఘర్షణకు పాల్పడి 20 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న డ్రాగన్ చైనాకు బ్యాడ్ టైం మొదలైంది. భారత్ (India) తరువాత ఇప్పుడు అమెరికా (United States) కూడా చైనా యాప్‌లను (china apps) నిషేధించడానికి తీవ్రంగా సన్నాహాలు చేస్తోంది.
చైనా మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ వీబో (chinese social media website weibo) లో పీఎం మోడీ 2015 నుంచి కొనసాగుతున్నారు. వీబోలో ప్రధాని మోడీకి 2,44,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. వీబోలో ప్రధాని మోడీ 115 పోస్టులు పోస్ట్ చేశారు.
Tik Tok, Chinese apps banned: న్యూ ఢిల్లీ: టిక్ టాక్, యూసీ బ్రౌజర్ సహా మొత్తం 59 మొబైల్ యాప్స్‌పై కేంద్రం నిషేధం విధించింది. ఇటీవల భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటి నుంచే చైనా యాప్స్‌పై నిషేధం ( Ban on chinese apps) విధించాల్సిందిగా దేశ పౌరుల నుంచి బలమైన డిమాండ్ వినిపిస్తూ వస్తోంది.
TikTok app: కరోనావైరస్ సంక్రమణ, భారత్‌తో వివాదం నేపధ్యంలో చైనాను, చైనా యాప్స్‌ను నిషేధించాలన్న ప్రచారం ఊపందుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడందరి దృష్టీ చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ యాప్ టిక్ టాక్ ( TikTok )పై పడింది. అయితే, టిక్‌టాక్‌పై వ్యక్తమవుతున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు ఇతర ఇంకొన్నిఇతర యాప్స్ రంగంలోకి దిగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.