Bhagini hastha bhojanam: భాయ్ దూజ్ పండగను ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువగా జరుపుకుంటారు. ఈ రోజున సోదరుడు తమ సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతితో వండిన పదార్థాలను తినాలని చెప్తుంటారు.
Yama dwitiya: అన్నా చెల్లెల పండుగ అంటే రాఖీ ఒక్కటే కాదు.. ఎప్పటినుంచో జరుపుకుంటున్న తోబుట్టువుల పండుగ ఒకటి ఉంది. పురాణాల ప్రకారం ఈ పండుగ రోజు ఆడపడుచు ఇంట్లో అన్నదమ్ములు భోజనం చేస్తే ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. ఇంతకీ ఆ పండుగ ఏమిటో తెలుసా?
ఇప్పటివరకు మనము సోదరి-సోదరుడు మధ్య అనుబంధం అంటే రాఖీ పండగ ఒక్కటే ఉందని అనుకున్నాం. కానీ, 'భగినీ హస్త భోజనం' అనే మరో పండుగ ఉందని ఎవరికీ తెలీదు. ఈ పండుగ దీపావళి వెళ్లిన రెండవరోజు, కార్తీక శుద్ధ విదియనాడు వస్తోంది. ఆ రోజున సోదరి ఇంట్లో చేతి భోజనం చేస్తే సంపూర్ణ ఆయుష్షు కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. సాధారణంగా వివాహమైన సోదరి ఇంట సోదరుడు, తల్లితండ్రులు భోజనం చేయరు. కారణం.. ఆడపిల్ల పుట్టింటి ఋణం ఉంచుకోకూడదు కాబట్టి! శుభకార్యాలకు వచ్చి బోంచేసినా తప్పులేదు కానీ ఊరికే వచ్చి భోజనం చేయకూడని సంప్రదాయం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.