గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు (GHMC Elections 2020) సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలన్ని ప్రచారంలో దూసుకెళ్తూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, ఎంఐఎం పార్టీ నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi)పై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. నిన్న బుధవారం విడుదల చేసిన మొదటి జాబితాలో 21 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. నేడు విడుదల చేసిన సెకండ్ లిస్టులో 18 మంది అభ్యర్థుల పేర్లు వెల్లడించింది. బీజేపి సెకండ్ లిస్ట్ అభ్యర్థుల పేర్లు ఇలా ఉన్నాయి.
Bandi Sanjay slams CM KCR | తెలంగాణ సీఎం కేసీఆర్‌కు దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు దీపావళి గిఫ్ట్ ఇచ్చారని, మరికొన్ని రోజుల్లో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సంక్రాంతి గిఫ్ట్ కూడా ఇస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Karimnagar MP Bandi Sanjay Kumar) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
#HyderabadLiberationDay | భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజు నేడు. 1947 ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్య్రం రాగా, తెలంగాణ సహా నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాజ్యానికి మాత్రం చీకటి రోజులు అలాగే ఉన్నాయి. తెలంగాణ విలీన దినోత్సవమా.. తెలంగాణ విమోచన దినోత్సవమా (Telangana Liberation Day) అనే వివాదం నేటికి కొనసాగుతోంది.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి (Bandi Sanjay Kumar pays tribute to Atal Bihari Vajpayee)కి నివాళులర్పించారు. కరీంనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి పుష్పాంజలి ఘటించారు.
COVID-19 tests | హైదరాబాద్: తెలంగాణ సర్కారుపై కేంద్ర ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేయనున్నట్టు రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు ( Bandi Sanjay ). మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనావైరస్ టెస్టులు సరిగా చేయడం లేదని, కరోనాపై యుద్ధం చేస్తోన్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి, ఇతర అధికారులకు పిపిఈ కిట్లు అందించడంలోనూ జాప్యం చోటుచేసుకుంటోందని బండి సంజయ్ ఆరోపించారు.
Bandi Sanjay Kumar: హైదరాబాద్: కొందరు వ్యక్తుల కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వం జి.ఓలు జారీ చేయడం దుర్మార్గమైన చర్య అని కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తమకు నచ్చినట్టుగా కొందరు వ్యక్తుల కోసం ఏకంగా జీవోలు జారీ చేయడం అనేది ప్రభుత్వం దిగజారుడుతనానికి ఓ నిదర్శనం అని ఆయన తెలంగాణ సర్కార్‌పై ( Telangana govt ) మండిపడ్డారు.
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన నేరం కింద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ( Bandi Sanjay ) నల్గొండ జిల్లా పెద్దవూర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెద్దవూర మండల పరిధిలోని బత్తాయి తోటలను పరిశీలించి రైతులను కలిసేందుకు వచ్చిన బండి సంజయ్... అక్కడే ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆయన వెంట బీజేపి జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డితో పాటు పార్టీకి చెందిన స్థానిక నేతలు కూడా ఉన్నారు.
కరోనావైరస్ సంక్షోభంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారికి సంఘీభావం వ్యక్తంచేస్తూ శుక్రవారం నాడు తాను ఒక రోజు ఉపవాస దీక్ష చేపడతానని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రకటించారు.
బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కరీంనగర్ ఎంపి బండి సంజయ్ (Bandi Sanjay).. ''సామాన్య కార్యకర్తను అయిన తనకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు చెబుతున్నాను'' అని అన్నారు.
బండి సంజయ్ కుమార్.. బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో స్వయం సేవకుడిగా ఉన్న ఆయన ఆ తర్వాతి కాలంలో అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్‌లో (ABVP) చేరి అంచలంచలుగా ఎదిగారు. ఏబీవీపీ పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమితులయ్యారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నియమితులయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కొద్దిసేపటి క్రితమే ఓ లేఖ విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.