గత ఏడాది కాలంగా తమిళనాడులోని సామాజిక, రాజకీయ పరిణామాలపై కమల్ హాసన్ ఎప్పటికప్పుడు తన ట్విటర్ ఖాతా ద్వారా ప్రస్తావిస్తూ ఆ రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ నేతలు, ఇతర రాజకీయ నాయకులని ఎండగడుతూ వస్తున్నారు.
రాజకీయ రంగంలోకి అడుగుపెట్టే సినీ ప్రముఖులు ఇటీవలి కాలంలో.. ప్రముఖ విప్లవకారులు లేదా సాహితీ దురంధరుల ఫోటోలు పెట్టుకొని కూడా జనాలను ఆకర్షించడం పరిపాటి అయిపోయింది.
కమల్ చేసిన 'హిందూ తీవ్రవాదం' విమర్శలపై రోజురోజుకీ మాటలతూటాలు పేలుతూనే ఉన్నాయి. తాజాగా కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై అఖిలభారత హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు పి.టి.అశోక్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అశోక్ శర్మ మాట్లాడుతూ- "హిందూ తీవ్రవాదులుగా హిందూమతం యొక్క అనుచరులను వర్ణించిన కమల్ హాసన్ వంటి వ్యక్తులను కాల్చి చంపాలి. మతపరమైన ఎజెండాలో భాగంగానే.. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు" అని మండిపడ్డారు.
కోలీవూడ్ స్టార్ విజయ్ నటించిన తమిళ చిత్రం 'మెర్సెల్'పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడులో వైద్యులు ఈ సినిమాను బహిష్కరించాలని కోరగా బీజేపీ కూడా వారికి మద్దతుగా నిలిచింది. ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలపై వ్యాఖ్యలు సరికాదంటూ రాష్ట్రం అంతటా ర్యాలీలు, నిరసన చేపడుతున్నారు. జల్లికట్టు నేపథ్యంలో సాగే 'మెర్సెల్' చిత్రంలో మెడికల్ మాఫియా, డిజిటల్ ఇండియా, జీఎస్టీపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సినిమాలో ఈ రెండు అంశాలపై అసత్య ప్రచారాలు చేశారని బీజీపీ వాపోయింది. ఈ వ్యాఖ్యలు తొలగించాలని డిమాండ్ చేసింది.
ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ క్షమాపణ కోరారు. నోట్ల రద్దు విషయంలో మద్దతు పలికినందుకు ఆయన ఈ క్షమాపణ చెప్పారు. 2016 లో పెద్ద నోట్లు రద్దు చేసిన తరువాత కమల్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రధాని నరేంద్ర మోదీకి సెల్యూట్ అంటూ ట్వీట్ కూడా చేశారు. అయితే పెద్ద నోట్ల రద్దుతో సమాజంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులను, సామాన్యుల సమస్యలను చూస్తేగానీ అర్థం కాలేదని, ఈ నిర్ణయానికి మద్దతిచ్చినందుకు నన్ను క్షమించండి అని ఒక తమిళ మ్యాగజిన్ కు రాసిన ఆర్టికల్ లో పేర్కొన్నారు.
కమల్ హాసన్ ప్రముఖ తమిళ నటుడు. తమిళంలో పాటు హిందీ, తెలుగు, మలయాళ చిత్రాల్లో కూడా నటించిన కమల్‌ను అభిమానులు లోకనాయకుడిగా అభివర్ణిస్తారు. నవంబర్ 7, 1954 తేదీన తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లాలోని పరమక్కుడిలో జన్మించిన కమల్ హాసన్ మూడున్నర ఏళ్ళ వయసులోనే చిత్రరంగంలోకి ప్రవేశించారు. ఆయన నటించిన తొలి చిత్రం "కలత్తూర్ కన్నమ్మ". హీరో కాకముందు కొన్ని చిత్రాల్లో డ్యాన్స్ మాస్టరుగా కూడా పనిచేసిన కమల్, దర్శకుడు కె.బాలచందర్ పరిచయమయ్యాక ఆయనతో కలసి ఎన్నో వైవిధ్యమైన చిత్రాలకు పనిచేశారు.
రాజకీయాల్లోకి తాను వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే తమిళ నటుడు కమల్ హాసన్ ప్రకటించిన నేపథ్యంలో, అతని నిర్ణయం పట్ల అన్ని రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో పలు పార్టీలు కమల్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయం పక్కన పెడితే, చెన్నైలో కమల్ తో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సమావేశం కాబోతూ ఉండటం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.