Shubman Gill takes stunning catch to dissmiss Sikandar Raza in IND vs ZIM 3rd ODI: ఒక్క క్యాచ్ క్రికెట్ మ్యాచ్ పరిస్థితినే మార్చేస్తుంది. ఒక్క క్యాచ్.. గెలుస్తుందనుకున్న జట్టును ఓడిస్తుంది, ఓడుతుందనుకున్న జట్టును గెలిపిస్తుంది. అందుకే 'క్యాచెస్ విన్ మ్యాచెస్' అని అంటారు. తాజాగా అది మరోసారి నిరూపితమైంది. జింబాబ్వే, భారత్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ఓ సూపర్ క్యాచ్ పట్టి.. టీమిండియాకు ఓటమి తప్పించాడు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గిల్ క్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
290 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు శుభారంభం దక్కలేదు. జింబాబ్వే బ్యాటర్స్ అంతా తడబడిన వేళ సికందర్ రజా (115; 95 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులు) ఒంటరి పోరాటం చేశాడు. వీరోచిత సెంచరీతో ఒక దశలో భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. రజా సెంచరీతో జింబాబ్వే క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకునేలా కనిపించింది. జింబాబ్వే విజయానికి చివరి 12 బంతుల్లో 17 పరుగులు అవసరం అయ్యాయి. రజా జోరు చూసి.. అందరూ జింబాబ్వే సునాయాసంగా గెలుస్తుంది అనుకున్నారు. ఈ సమయంలో శుభ్‌మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు.
శార్దూల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 49వ ఓవర్ నాలుగో బంతికి సికందర్ రజా భారీ షాట్‌కు యత్నించాడు. ఫుల్‌లెంగ్త్ డెలివరీని లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీ లైన్ వద్ద శుభ్‌మన్ గిల్ అద్భుతంగా స్పందించి క్యాచ్‌ను అందుకున్నాడు. ముందుకు పరిగెత్తుకొచ్చి అద్బుతంగా డైవ్ చేస్తూ క్యాచ్ పట్టాడు. ఇక్కడే మ్యాచ్ టర్న్ అయింది. రజా ఔటైన వెంటనే జింబాబ్వే ఆలౌట్ అయింది. దీంతో జింబాబ్వే ఓటమిపాలై క్లీన్‌స్వీప్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
First with the bat and then with a diving catch, this man won our hearts more than once today 😍
How good was this effort from @ShubmanGill to dismiss the dangerous Sikandar Raza? 🤩💯#ShubmanGill #ZIMvIND #TeamIndia #SirfSonyPeDikhega pic.twitter.com/u5snCqECBw
— Sony Sports Network (@SonySportsNetwk) August 22, 2022
మూడో వన్డేలో శుభ్‌మన్ గిల్ (130) శతకం చేశాడు. కెరీర్లోనే తొలి సెంచరీ సాధించిన గిల్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు. మూడు వన్డేల్లో 245 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'ను కూడా అందుకున్నాడు. ఈ మ్యాచులో భారత్ 13 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 289 స్కోరు చేసింది. అనంతరం జింబాబ్వే 276 పరుగులకు ఆలౌటై అయింది.
Also Read: టీమిండియాకు షాకింగ్ న్యూస్.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌కు అతడు దూరం!
Also Read: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్! దసరాకు భారీగా డబ్బులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook