షార్జా: షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన T10 క్రికెట్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో నార్తర్న్ వారియర్స్ జట్టు పాక్‌టూన్స్ జట్టుపై 22 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత టాస్ గెలిచిన ఫాఖ్టూన్స్ జట్టు బౌలింగ్‌కే మొగ్గు చూపడంతో నార్నర్త్ వారియర్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో నార్తర్న్ వారియర్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేయడంతో అనంతరం 141 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఫాఖ్టూన్స్ జట్టు షాహిదీ అఫ్రిదిపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. టోర్నమెంట్ మొత్తంలో ఉత్తమమైన పర్ఫార్మెన్స్ కనబర్చిన షాహిద్ అఫ్రిదీ ఈ మ్యాచ్‌లో మాత్రం నార్తర్న్ వారియర్స్ తరపున సాతాఫ్రికన్ బౌలర్ హార్దస్ విల్జోన్ విసిరిన బంతికి ఔట్ అవడంతో కేవలం 17 పరుగులకే పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది.
ఆండ్రె ఫ్లెచర్ 18 బంతుల్లో 37 పరుగులు (4X2, 6X4) రాబట్టి ఫాఖ్టూన్స్ జట్టును నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ.. నార్తర్న్ వారియర్స్ బౌలర్స్ దూకుడు ముందు అతడి ఆటలు కూడా ఎంతోసేపు సాగలేదు. కామెరాన్ డెల్పోర్ట్ (3), షఫిఖుల్లా షఫిక్ (26), కొలిన్ ఇంగ్రమ్ (0) వంటి కీలక ఆటగాళ్లంతా తక్కువ స్కోర్కె వెనుతిరగడంతో నార్తర్న్ వారియర్స్ విజయం ఖాయమైపోయింది.
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ మీడియా సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) చెందిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ ZEE5 స్పాన్సర్స్‌గా వ్యవహరిస్తున్న నార్తర్న్ వారియర్స్ జట్టు లీగ్‌లోకి ప్రవేశించిన తొలి ఏడాదే టైటిల్‌ని చేజిక్కించుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రముఖ వెస్ట్ ఇండీస్ క్రికెటర్ డారెన్ సమీ కెప్టెన్‌గా ఉన్న ఈ జట్టులో పాక్ క్రికెటర్ వహబ్ రియాజ్, విండీస్ ఆటగాళ్లు డ్వేన్ స్మిత్, సైమన్స్, దుబాయ్ ఆటగాడు ఇమ్రాన్ హైదర్, ఇంగ్లండ్ ఆటగాడు రవి బొపార, ఆస్ట్రేలియా నుంచి క్రిస్ గ్రీన్, భారత ఆటగాడు అమిటోజ్ సింగ్ వంటి ఆటగాళ్లు ఇతర కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. ఇండియన్ ఆల్-రౌండర్ రాబిని సింగ్ నార్తర్న్ వారియర్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు.
నవంబర్ 21న ప్రారంభమైన 2వ సీజన్ ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా కొనసాగింది. ఈ ఏడాది ఈ లీగ్‌లో ప్రవేశించిన మూడు కొత్త జట్లలో నార్తర్న్ వారియర్స్ జట్టు కూడా ఒకటి. ప్రవేశించిన తొలి ఏడాదే జట్టు ఫైనల్స్‌కి చేరడం పట్ల నార్తర్న్ వారియర్స్ ఆటగాళ్లు సంతోషం వ్యక్తంచేశారు. ఫైనల్స్‌లోనూ శాయశక్తులా కృషిచేసి టైటిల్‌ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తామని సమి విశ్వాసం వ్యక్తంచేశాడు.
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 90కిపైగా దేశాల్లో ఎంటర్టైన్మెంట్ యాగ్రిగేటర్గా సేవలు అందిస్తున్న ZEE5 T10 క్రికెట్ లీగ్ 2వ సీజన్‌కి టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది.
నార్తర్న్ వారియర్స్ జట్టు ఆటగాళ్లు : సైమన్స్, నిఖోలస్ పూరన్, ఆండ్రె రస్సెల్, రవ్మన్ పావెల్, రవి బొపార, అమిటోజ్ సింగ్, డారెన్ సమీ (కెప్టేన్), హార్డుస్ విల్జెన్, ఇమ్రాన్ హైదర్, క్రిస్ గ్రీన్, వాహబ్ రియాజ్, డ్వేన్ స్మిత్, హ్యారీ గుర్నీ, ఖేరీ పీర్, కెన్నార్ లూయిస్, రాహుల్ భాటియా.
పాఖ్టూన్స్ జట్టు ఆటగాళ్లు : షాహిద్ అఫ్రిదీ, కొలిన్ ఇంగ్రమ్, డేవిడ్ విల్లీ, మొహమ్మద్ ఇర్ఫాన్, లియమ్ డేసన్, కొలిన్ మున్రో, ఆండ్రె ఫ్లెచర్, సోహైల్ ఖాన్, షత్రఫుద్దీన్ అష్రఫ్, చాదిక్ వాల్టన్, షాపూర్ జద్రన్, గుల్బదిన్ నయబ్, కెమరాన్ డెల్పోర్ట్, హఫీజ్ ఖలీమ్, షీర్ వల్లి, ఆర్పీ సింగ్.