Harbhajan Singh issues warning to Virat Kohli: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) డైరెక్టుగానే వార్నింగ్ ఇచ్చాడు. కెప్టెన్‌గా ఉన్నపుడు జట్టులో స్థానంపై భరోసా ఉండేదని, ఇప్పుడు అది లేదన్నాడు. ఇకపై పరుగులు చేయకుంటే వైట్-బాల్ క్రికెట్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కోహ్లీకి హామీ ఇవ్వలేమని హర్భజన్ అన్నాడు. జట్టులో స్థానం సురక్షితంగా ఉంచుకోవాలంటే నిలకడగా రాణించాల్సి ఉంటుందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. ఏ ఆటగాడికైనా మంచి ప్రదర్శనలే జట్టులో స్థానం కల్పిస్తాయి అని కోహ్లీకి భజ్జీ సూచనలు చేశాడు.
గత ఏడాది టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం టీ20 కెప్టెన్సీకి గుడ్ బై (Virat Kohli Captaincy) చెప్పిన విరాట్ కోహ్లీ.. మెగా టోర్నీకి ముందే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు డిసెంబరులో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించింది. ఇక దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్సీకీ కూడా గుడ్ బై చెప్పాడు. దాంతో కోహ్లీ ఇప్పుడు కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతున్నాడు.
దక్షిణాఫ్రికా పర్యటనలో (IND vs SA) విరాట్ కోహ్లీ విఫలమయిన విషయం తెలిసిందే. టెస్టుల్లో మోస్తరు ప్రదర్శన చేసిన కోహ్లీ.. తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసి పర్వాలేదనిపించాడు. ఇక కీలక రెండో వన్డేలో ఐదు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో కోహ్లీకి హర్భజన్ సింగ్ డైరెక్టుగానే వార్నింగ్ (Harbhajan Singh issues warning to Virat Kohli) ఇచ్చాడు. 'ఏడేళ్ల తర్వాత కెప్టెన్ పదవి నుంచి వైదొలిగినప్పుడు జట్టు సభ్యులతో సహా చాలా మంది ఆశ్చర్యపోయారు. కోహ్లీ తొందరపడి ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేనే చాలా ఆశ్చర్యపోయా. కానీ విరాట్ మనసులో ఏముందో. భవిష్యత్తులో అతను ఏమి చేయాలనుకుంటున్నాడో' అని భజ్జీ అన్నాడు.
'కెప్టెన్‌గా ఉన్నప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అదే ఒక బ్యాటర్‌గా భిన్నమైన ఒత్తిడి ఉంటుంది. విరాట్ కోహ్లీ బిగ్ ప్లేయర్ అని మనందరికీ తెలుసు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు ప్లేయింగ్ ఎలెవన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ జట్టులో చోటు ఉంటుంది. అదే కేవలం బ్యాటర్‌గా ఉన్నపుడు మాత్రం.. పరుగులు చేస్తేనే జట్టులో చోటు దక్కుతుంది. గత 7 సంవత్సరాలుగా కెప్టెన్‌గా ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడని చెప్పాలనుకుంటున్నాను. బ్యాటర్‌గా అతని ప్రదర్శన కూడా అంతే మెరుగ్గా కొనసాగుతుందని ఆశిస్తున్నాను. కోహ్లీ టీమిండియా కోసం మ్యాచ్‌లను గెలిపిస్తాడు' అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook