Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. అరంగేట్రం చేసిన తర్వాత ఇది రెండోసారి!!

విరాట్‌ కోహ్లీ 2020 మాదిరిగానే 2021ని కూడా ఒక్క సెంచరీ లేకుండా పూర్తి చేశాడు. కోహ్లీ చివరిసారిగా 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై శతకం నమోదు చేశాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 08:37 AM IST
  • విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు
  • సెంచరీ లేకుండా మరో ఏడాది ముగిసింది
  • 2021లో ఒక్క సెంచరీ చేయని విరాట్ కోహ్లీ
  • 2021 విరాట్ కోహ్లీ కెరీర్‌లో చేదు జ్ఞాపకం
 Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. అరంగేట్రం చేసిన తర్వాత ఇది రెండోసారి!!

Virat Kohli completes 2021 without scoring a century in international cricket: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలోకి దిగాడంటే పరుగుల వరద పారుతుంది, రికార్డుల మోత మోగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ అయినా భారీ ఇన్నింగ్స్ ఆడుతాడు. ఇక సెంచరీ (Century)లను మంచినీరు తగినంత సులువుగా చేస్తుంటాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో 70 శతకాలు బాదిన ఘనత కోహ్లీకి ఉంది. అయితే గత రెండేళ్లుగా కోహ్లీ జోరుకు బ్రేక్ పడింది. ఏమైందో ఏమోకానీ సెంచరీల మోత మోగించే విరాట్ బ్యాట్ పూర్తిగా మూగబోయింది. మూడు ఫార్మాట్లలో అడపాదడపా ఇన్నింగ్స్‌లు ఆడినా.. తన స్థాయికి తగ్గ ప్రదర్శన మాత్రం ఇవ్వలేదు. దాంతో 2021 అతని కెరీర్‌లో చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.

విరాట్‌ కోహ్లీ 2020 మాదిరిగానే 2021ని కూడా ఒక్క సెంచరీ (Virat Kohli Century) లేకుండా పూర్తి చేశాడు. కోహ్లీ చివరిసారిగా 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై శతకం నమోదు చేశాడు. కోల్‌కతా వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక డే/నైట్ టెస్ట్‌లో కోహ్లీ (136) శతకం బాదాడు. ఆ తర్వాత మళ్లీ సెంచరీ చేయలేదు. దాంతో సెంచరీ లేకుండా 2020, 2021ని ముగించాడు. కోహ్లీ అరంగేట్రం చేసిన ఏడాది మినహాయిస్తే.. ప్రతి ఏడాది సెంచరీ చేశాడు. అంటే.. 2009 నుంచి 2019 వరకు కోహ్లీ ప్రతీ ఏడాది కనీసం ఒక్క సెంచరైనా బాదాడు. కానీ 2020, 2021లో మూడు ఫార్మాట్లో కలిపి ఒక్క శతకం బాదలేకపోయాడు. దాంతో విరాట్ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. 

Also Read: Horoscope 30 December 2021: ఈ రాశి వారికి నేడు కలిసొస్తుంది.. ప్రేయసితో శృంగారానికి అనువైన సమయం!

టెస్ట్ క్రికెట్‌లో ఈ ఏడాది 10 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ కోహ్లీ.. ఒక్క సెంచరీ కూడా చేయలేదు. మొత్తంగా 11 మ్యాచ్‌ల్లో 28.21 సగటుతో 536 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ అత్యధిక స్కోరు 72. ఈ ఏడాది మూడు వన్డేలు మాత్రమే ఆడిన టీమిండియా టెస్ట్ కెప్టెన్.. 43 సగటుతో 129 రన్స్ చేశాడు. వన్డేల్లో అత్యధిక స్కోరు 66. ఇక 8 టీ20ల్లో 37.7 సగటుతో 299 రన్స్ చేయగా.. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో అత్యధిక స్కోరు 80. దక్షిణాఫ్రికా జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లీ 35, 18 పరుగులు మాత్రమే చేసి అభిమానులను పూర్తిగా నిరాశపరిచాడు. దాంతో ఈ ఏడాది ముగిసింది. 

Also Read: NTR Comments on Ram Charan: రామ్ చరణ్ పై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు.. 'మా బంధం ఈ సినిమాతో ముగిసిపోదు!'

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇప్పటి వరకూ 97 టెస్టులాడి 52.06 సగటుతో 7801 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 95 టీ20లలో 52.00 సగటుతో 3227 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్‌నులో అత్యధిక స్కోర్ 94 నాటౌట్. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 23 వేలకు పైగా పరుగులు చేశాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News