India Vs Pakistan Test Match: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. అదే జరిగితే భారత్-పాక్ మధ్య టెస్ట్ మ్యాచ్‌

Ind Vs Pak Test Match WTC 2025: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగి  17 ఏళ్లు దాటిపోయింది. ఐసీసీ ఈవెంట్స్‌లో వన్డేలు, టీ20 ఫార్మాట్‌లో తలపడినా.. టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రం ముఖాముఖి తలపడలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రెండు జట్లు చేరుకుంటే బిగ్‌ ఫైట్ చూడొచ్చు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 31, 2024, 06:10 PM IST
India Vs Pakistan Test Match: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. అదే జరిగితే భారత్-పాక్ మధ్య టెస్ట్ మ్యాచ్‌

Ind Vs Pak Test Match WTC 2025: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అనగానే.. అభిమానులకు ఎక్కడ లేని పూనకం వస్తుంది. మ్యాచ్ డేట్ అనౌన్స్ అయినప్పటి నుంచే టికెట్లకు ప్రయత్నాలు మొదలవుతాయి. అంతేకాకుండా మ్యాచ్ జరిగే నగరంలో హోటల్ రూమ్స్ కోసం భారీగా డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం రెండు జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ముఖాముఖి తలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాల కారణంగా జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి. ఐసీసీ ట్రోఫీలకు పాక్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్నా.. టీమిండియా మాత్రం పాక్‌లో అడుగుపెట్టేందుకు ససేమిరా అంటోంది. గతంలో ఆసియా కప్ పాకిస్థాన్ వేదికగా జరగ్గా.. భారత్‌కు సంబంధించిన మ్యాచ్‌లు మాత్రం శ్రీలంకలో నిర్వహించారు. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్‌ ట్రోఫీ కోసం టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్లేది లేదని బీసీసీఐ స్పష్టం చేస్తోంది. శ్రీలంక లేదా దుబాయ్ వేదికగా నిర్వహించాలని చెబుతోంది. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read: Puja khedkar: పూజా ఖేద్కర్ పై శాశ్వత నిషేధం.. సంచలన నిర్ణయం తీసుకున్న యూపీఎస్సీ..

ఈ నేపథ్యంలోనే ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ తెరపైకి వచ్చింది. 2023-25 ​​ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ కోసం అన్ని జట్లు టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్నాయి. భారత్, పాకిస్థాన్ ఒక వేళ ఫైనల్‌కు చేరుకుంటే.. మళ్లీ టెస్ట్ క్రికెట్‌లో రెండు జట్లు నేరుగా తలపడతాయి. ఇప్పటివరకు జరిగిన రెండు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ల్లోనూ టీమిండియా ఫైనల్స్‌కు చేరుకున్నా.. ట్రోఫిని మాత్రం ముద్దాడలేదు. ప్రస్తుతం 2023-25 ​​ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ 68.52 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 62.50 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

మరోవైపు పాకిస్థాన్ ఫైనల్స్‌కు చేరుకోవాలంటే భారీగా రాణించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ​​సైకిల్‌లో దయాది టీమ్ ఐదో ర్యాంక్‌లో ఉంది. పాకిస్థాన్ ఖాతాలో 36.66 శాతం పాయింట్లు ఉన్నాయి. ఇప్పటివరకు పాక్ టీమ్ ఐదు టెస్టులు ఆడింది. ఈ ఏడాది పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లతో టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లను పాక్ నెగ్గితే ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది. అటు భారత్ ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో భారత్ టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లను నెగ్గితే టీమిండియా వరుసగా మూడోసారి ఫైనల్‌లో ఎంట్రీ ఇస్తుంది. 

దాదాపు 17 ఏళ్లుగా భారత్‌, పాకిస్థాన్‌లు టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు. 2007లో చివరగా టెస్ట్ మ్యాచ్ జరిగింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రెండు జట్లు చేరితే అభిమానుల కోరిక నెరవేరుతుంది. ఈ క్షణం కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రీసెంట్‌గా టీ20 వరల్డ్ కప్‌లో రెండు జట్ల మధ్య జరిగిన పోరులో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. 

Also Read: Mahindra Thar Roxx: 5 డోర్లతో మహీంద్రా థార్ రాక్స్‌ వచ్చేస్తోంది.. దిమ్మతిరిగే ఫీచర్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News