క్రికెట్ ప్రపంచంలో సరికొత్త ఘట్టం ఆవిష్కకృతమైంది. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు అయింది. ఇంగ్లాండ్‌కు చెందిన యువ క్రికెటర్ విల్‌జాక్స్ కేవలం 25 బంతుల్లో శతకం బాదిన ఆ క్రికెటర్ సరికొత్త రికార్డును సృష్టించాడు.
కౌంటీ క్రికెట్‌లో ...
దుబాయ్లో వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లో భాగంగా టీ10 మ్యాచ్ లో లాంకాషైర్, సర్రే జట్లు తలబపడ్డాయి. ఈ మ్యాచ్ లో సర్రే జట్టు తరఫున బరిలోకి దిగిన యువ క్రికెటర్ విల్‌జాక్స్ వీరోచిత సెంచరీ ( 30 బంతుల్లో 105) చేసి జట్టును అద్భుత విజయాన్ని అందించాడు.
ఇది సరికొత్త చరిత్ర
శతకం బాదడంతో పాటు ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టి చరిత్ర సృష్టించాడు. విల్‌జాక్స్ విధ్వంకరం బ్యాటింగ్ కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే జట్టు మూడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన లాంకాషైర్ జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 81పరుగులు చేసి ఓటమి పాలైంది. సర్రే బౌలర్ గారెత్ బాట్టీ 21 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.
8⃣ fours
1⃣1⃣sixes including six in an over@wjacks9' 100 in 25 balls against @lancscricket 💥 pic.twitter.com/HKwfv4RXfq— Surrey Cricket (@surreycricket) March 21, 2019
ప్చ్.. అధికారిక హోదా లేదు..
అయితే ఈ మ్యాచ్‌కు అధికారిక హోదా లేకపోడంతో విల్‌జాక్స్ విరోచిత ఇన్నింగ్స్ క్రికెట్ రికార్డులోకి చోటు దక్కించుకోలేకపోయింది. ఒకవేళ రికార్డులకెక్కితే.. 2013 ఐపీఎల్‌లో 30 బంతుల్లో శతకం బాదిన క్రిస్‌గేల్ రికార్డును జాక్స్ బద్దలుకొట్టేవాడే. అయితే క్రికెట్ చరిత్రలో చిలకాలం పాటు గుర్తుండోపేయే మ్యాచ్ ఆడారు విల్‌జాక్స్. క్రికెట్ దిగ్గజాలకు సైతం సాధ్యం కానీ రికార్డు సాధించిన విల్‌జాక్స్ ఎప్పటికీ గుర్తిండి పోతాడని పలువురు మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.