World Cup 2023: భారీ స్కోరుతో దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు, వన్డే ప్రపంచకప్‌లో టాప్ 10 అత్యదిక స్కోర్లు ఇవే

World Cup 2023: ప్రపంచకప్ 2023 ప్రారంభంలోనే రికార్డులు బద్దలౌతున్నాయి. ఢిల్లీ వేదికగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు కొత్త చరిత్ర లిఖించింది. ఇవాళ్టి మ్యాచ్‌లో ఏకంగా మూడు రికార్డులు నమోదయ్యాయి. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 7, 2023, 11:08 PM IST
World Cup 2023: భారీ స్కోరుతో దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు, వన్డే ప్రపంచకప్‌లో టాప్ 10 అత్యదిక స్కోర్లు ఇవే

World Cup 2023: ఢిల్లీలో ఇవాళ జరిగిన దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌ను ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేరు. పరుగుల విధ్వంసం చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా బ్యాటర్ల ఊచకోత నిర్దాక్షిణ్యంగా కన్పించింది. కొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్ల గురించి ఓసారి తెలుసుకుందాం..

ఢిల్లీ వేదికగా ఇవాళ జరిగిన ప్రపంచకప్ 2023 దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌లో భారీ రికార్డు క్రియేట్ అయింది. శ్రీలంక జట్టుపై దక్షిణాఫ్రికా జట్టు 5 వికెట్ల నష్టానికి నిర్ణీత 50 ఓవర్లలో 428 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇది వన్డే ప్రపంచకప్ చరిత్రలో కొత్త రికార్డు. 2015లో ఆస్ట్రేలియా నెలకొల్పిన టాప్ స్కోర్ రికార్డును దక్షిణాఫ్రికా ఇవాళ బ్రేక్ చేసింది. అంతేకాదు ఒకే ఇన్నింగ్స్‌లో 3 భారీ రికార్డులు నమోదు చేసింది. 2015లో ఆఫ్గనిస్తాన్‌పై ఆస్ట్రేలియా 417 పరుగులు సాధించింది. ఇదే నిన్నటి వరకూ అత్యధిక వన్డే ప్రపంచకప్ స్కోరు. ఇవాళ దక్షిణాఫ్రికా జట్టు 428 పరుగులతో ఆ రికార్డును బ్రేక్ చేసింది. 

మరోవైపు ఇవాళ్టి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేసిన మరో రికార్డు సృష్టించారు. ఇక 400 పైగా పరుగుల్ని 3 సార్లు నమోదు చేసిన జట్టుగా మరో రికార్డు సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ అత్యదిక స్కోర్ల వివరాలు ఇలా ఉన్నాయి..

1. దక్షిణాఫ్రికా జట్టు శ్రీలంకపై 2023 ప్రపంచకప్‌లో 428 పరుగులు
2. ఆస్ట్రేలియా జట్టు ఆఫ్ఘనిస్తాన్‌పై 2015లో 417 పరుగులు
3. టీమ్ ఇండియా జట్టు బెర్ముడాపై 2007లో 413 పరుగులు
4. దక్షిణాఫ్రికా జట్టు ఐర్లాండ్ జట్టుపై 2015లో 411 పరుగులు
5. దక్షిణాఫ్రికా జట్టు వెస్ట్ ఇండీస్‌పై 2015లో 408 పరుగులు
6. శ్రీలంక జట్టు కెన్యాపై 1996లో 398 పరుగులు
7. ఇంగ్లండ్ జట్టు ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై 2019లో 397 పరుగులు
8. న్యూజిలాండ్ జట్టు వెస్ట్ ఇండీస్‌పై 2015లో 393 పరుగులు
9. ఇంగ్లండ్ జట్టు బంగ్లాదేశ్‌పై 20198లో 386 పరుగులు
10. ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్‌పై 2019లో 381 పరుగులు

Also read: Ind vs Aus: ఇండియా తొలి మ్యాచ్ రేపే, చెన్నై పిచ్ ఎవరికి అనుకూలం, టాస్ కీలకం కానుందా

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News