INDW vs PAKW: పాకిస్తాన్‌పై ఘన విజయం.. వన్డే ప్రపంచకప్‌ 2022లో భారత్ బోణీ!!

India beat Pakistan in ICC Women's World Cup 2022.  ఐసీసీ మహిళా ప్రపంచకప్‌ 2022లో భారత్ బోణి కొట్టింది. దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచులో భారత్ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2022, 02:08 PM IST
  • ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ 2022
  • పాకిస్తాన్‌పై ఘన విజయం
  • ప్రపంచకప్‌ 2022లో భారత్ బోణి
INDW vs PAKW: పాకిస్తాన్‌పై ఘన విజయం.. వన్డే ప్రపంచకప్‌ 2022లో భారత్ బోణీ!!

India beat Pakistan in ICC Women's World Cup 2022: న్యూజీలాండ్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ మహిళా ప్రపంచకప్‌ 2022లో భారత్ బోణీ కొట్టింది. బే ఓవల్ వేదికగా ఆదివారం దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచులో భారత్ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 43 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ సిద్రా అమీన్ (30; 64 బంతుల్లో 3x4) టాప్ స్కోరర్. టీమిండియా బౌలర్ రాజేశ్వరి గైక్వాడ్ 4 వికెట్లు పడగొట్టారు. అద్భుత హాఫ్ సెంచరీ చేసిన పూజా వస్త్రాకర్‌ (67; 59 బంతుల్లో 8x4)కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. 

245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు నెమ్మదిగా ఆడింది. భారత బౌలర్లు జులన్ గోస్వామి, మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్ కట్టుదిట్టంగా బంతులేయడంతో పాక్ పరుగులు చేసేందుకు కష్టపడింది. దాంతో 10 ఓవర్లకు 28 పరుగులే చేసింది. 11వ ఓవర్లో ఓపెనర్ జవేరియా ఖాన్ (11)ను గైక్వాడ్ ఔట్ చేయడంతో పాక్ పతనం మొదలైంది. బిస్మా మరూఫ్ (15), ఒమైమా సోహైల్ (5), సిద్రా అమీన్, నిదా దార్ (4), అలియా రియాజ్ (11), ఫాతిమా సనా (17) కొద్ది వ్యవధిలో ఔట్ అవ్వడంతో పాక్ ఓటమి ఖాయం అయింది. 

వికెట్ కీపర్ సిద్రా నవాజ్ (12) పరుగులు చేయగా.. ఇన్నింగ్స్ చివర్లో డయానా బేగ్ (24) రన్స్ చేయడంతో పాక్ ఆ మాత్రం స్కోరు అయినా చేసింది. భారత బౌలర్లలో రాజేశ్వరీ గైక్వడ్ (4/31) నాలుగు వికెట్లతో చెలరేగగా.. జూలన్ గోస్వామి (2/26), స్నేహ్ రాణా (2/27) రెండేసి వికెట్లు పడగొట్టారు. మేఘన సింగ్, దీప్తి శర్మకు తలో వికెట్ దక్కింది. 

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. ఓపెనర్‌ స్మృతి మంధాన (52; 75 బంతుల్లో 3x4, 1x6) హాఫ్ సెంచరీ చేసినా.. టాప్ ఆర్డర్ తడబడంతో మిథాలీ సేన 114 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో స్నేహ రాణా (53; 48 బంతుల్లో 4x4), పూజా వస్త్రాకర్‌ (67; 59 బంతుల్లో 8x4) హాఫ్ సెంచరీలు చేసి జట్టును ఆదుకున్నారు. పాక్ బౌలర్లు నిదా దార్, నష్రా సంధు తలో రెండు వికెట్లు పడగొట్టారు. 

Also Read: Trivikram Remuneration: త్రివిక్రమ్ షాకింగ్ రెమ్యూనరేషన్.. 'సూపర్ స్టార్' మహేష్ బాబుకు పోటీగా!!

Also Read: Actor karthik Engagement: త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న 'నారప్ప' నటుడు.. ఎంగేజ్​మెంట్​ ఫిక్స్ వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News