Women's IPL: మహిళల ప్రీమియర్‌ లీగ్ జట్లు ఇవే.. బీసీసీఐకి రూ. 4670 కోట్లు! పురుషుల ఐపీఎల్ కంటే ఎక్కువ

BCCI officially launches Womens Premier League. మహిళల ఐపీఎల్‌ పేరుని ‘మహిళల ప్రీమియర్‌ లీగ్’గా ఖరారు చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ప్రకటించారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 25, 2023, 06:05 PM IST
  • మహిళల ప్రీమియర్‌ లీగ్ జట్లు ఇవే
  • బీసీసీఐకి రూ. 4670 కోట్లు
  • పురుషుల ఐపీఎల్ కంటే ఎక్కువ
Women's IPL: మహిళల ప్రీమియర్‌ లీగ్ జట్లు ఇవే.. బీసీసీఐకి రూ. 4670 కోట్లు! పురుషుల ఐపీఎల్ కంటే ఎక్కువ

BCCI announces Womens Premier League Teams and Bid Valuation: క్రికెట్‌ అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న 'మహిళల ఐపీఎల్‌'కు అధికారికంగా ముహూర్తం కుదిరింది. మహిళల ఐపీఎల్‌ పేరుని ‘మహిళల ప్రీమియర్‌ లీగ్’గా ఖరారు చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ప్రకటించారు. తొలి ఎడిషన్‌లో 5 ప్రాంఛైజీలు పాల్గొననున్నాయి. ఐదు ఫ్రాంచైజీలను సొంతం చేసుకున్న బిడ్డర్ల వివరాలను బీసీసీఐ ప్రకటించింది. ఈ వేలం ద్వారా బీసీసీఐకి కాసుల వర్షం కురిసింది. 5 జట్ల ద్వారా బీసీసీఐకి రూ. 4670 కోట్లు ఖజానాలో చేరాయి. 

అహ్మదాబాద్‌ జట్టును అదానీ స్పోర్ట్స్‌లైన్ రూ. 1,289 కోట్లకు దక్కించుకోగా.. ముంబై జట్టును ఇండియావిన్‌ స్పోర్ట్స్‌ రూ. 913 కోట్లకు కైవసం చేసుకుంది. బెంగళూరు జట్టును రాయల్‌ ఛాలెంజర్స్‌ స్పోర్ట్స్‌ రూ. 901 కోట్లకు, ఢిల్లీ జట్టును జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్‌ క్రికెట్ రూ. 810 కోట్లకు‌,  లక్నో జట్టును కాప్రీ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ రూ. 757 కోట్లకు దక్కించుకుంది. దాంతో బీసీసీఐకి రూ. 4670 కోట్ల భారీ మొత్తం సమకూరింది. 2008లో ప్రారంభమైన పురుషుల ఐపీఎల్ కోసం జట్ల బిడ్డింగ్ ద్వారా పొందిన దాని కంటే.. ఇది ఎక్కువ అని జై షా తెలిపారు.

పురుషుల ఐపీఎల్‌‌కు చెందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు మాత్రమే మహిళల ఐపీఎల్‌లో భాగం అయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ చివరి నిమిషంలో వేలం నుంచి తప్పుకున్నాయి. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల కోసం ప్రయత్నించాయి. మహిళల క్రికెట్‌లో విప్లవానికి ఇది నాంది అని చెప్పొచ్చు. పురుషుల వలె తమకు కూడా ఐపీఎల్ ఉండాలని పలువురు మహిళా క్రికెటర్లు కోరుకున్న విషయం తెలిసిందే. 

మహిళల ప్రీమియర్‌ లీగ్ జట్లు ఇవే:
1. ఇండియా విన్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ముంబై, 912.99 కోట్లు)
2. అదానీ స్పోర్ట్స్‌లైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (అహ్మదాబాద్‌, 1289 కోట్లు)
3. రాయల్‌ ఛాలెంజర్స్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బెంగళూరు, 901 కోట్లు)
4. క్యాప్రీ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (లక్నో, 757 కోట్లు)
5. జేఎస్‌డబ్యూ జీఎంఆర్‌ క్రికెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఢిల్లీ, 810 కోట్లు)

Also Read: Hyundai Creta Price: కేవలం 7.5 లక్షలకే హ్యుందాయ్ క్రెటా.. రోడ్ టాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు!  

Also Read: IND Vs NZ: శార్దూల్ ఠాకూర్‌పై రోహిత్ శర్మ సీరియస్.. బంతి ఇలానే వేసేదంటూ.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News