Ipl 2022 KKR vs LSG: శనివారం ఐపీఎల్ లో జరిగే రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. లక్నో ఆడిన 10 మ్యాచుల్లో 7 విజయాలు సాధించింది. 14 పాయింట్లతో టేబుల్ లో రెండో స్థానంలో ఉంది. రాహుల్ సేన గత మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించి మంచి జోరు మీదుంది. ఇక లక్నో జట్టులో డికాక్, రాహుల్, దీపక్ హుడా, స్టోయినిస్, కృణాల్ పాండ్యా, అయుష్ బదోనీ, హోల్డర్ లాంటి అద్భుత ఆటగాళ్లు ఉన్నారు.
కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. ఆడిన 10 మ్యాచుల్లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేసి.. 451 పరుగులతో లీగ్ లో సెకండ్ టాపర్ గా ఉన్నాడు. అటు క్వింటన్ డికాక్ కూడా 10 మ్యాచులు ఆడి రెండు హాఫ్ సెంచరీలతో 294 పరుగులు చేశాడు. దీపక్ హుడా 279 పరుగులు చేయగా.. అందులో మూడు ఫిఫ్టీలు ఉన్నాయి. లక్నో బ్యాటింగ్ లో ఉన్నంత పటిష్టంగా బౌలింగ్ లో లేదని చెప్పుకోవాలి.
ఇక కోల్ కతా జట్టు ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడగా.. కేవలం నాలుగింట్లో మాత్రమే విజయం సాధించింది. వరుసగా ఐదు ఓటముల తర్వాత చివరగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ఈ జట్టులో ఫించ్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రింకు సింగ్, సునీల్ నరైన్, రస్సెల్ లాంటి అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్ విభాగంలోనూ కోల్ కతా జట్టు పటిష్ఠంగా ఉంది. ఉమేష్ యాదవ్, రస్సెల్, సౌథీ, నరైన్, శివమ్ మావీలతో బలంగానే కనిపిస్తోంది. కోల్ కతా ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్ రేసులో నిలిచే అవకాశాలు మరింత మెరుగు అవుతాయి.
Also Read:Komaram Bheemudu Song: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. 'కొమురం భీముడో' సాంగ్ వీడియో వచ్చేసింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.