భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రీఎంట్రీపై క్లారిటీ వచ్చేసింది. ధోనీని మళ్లీ జట్టులోకి తీసుకోవాలంటే ఏం చేయాలో టీమిండియా కొత్త సెలక్షన్ కమిటీ స్పష్టం చేసింది. 2019 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ చేతిలో సెమీస్ ఓటమి అనంతరం టీమిండియాకు ధోనీ దూరంగా ఉన్నాడు. అనంతరం కొన్ని సిరీస్‌లకు ధోనీని పక్కన పెట్టేశారు. ఇటీవల బీసీసీఐ కాంట్రాక్టుల్లో కూడా ధోనీ పేరును తప్పించి సంకేతాలు పంపించారు.
6, 6, 6, 6, 6 లతో ఐపీఎల్ కు ముందే మెరుపులు.. ఈ సారి వారిపై కసి తీర్చుకోనున్నాడా?
ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే ట్వంటీ20 వరల్డ్ కప్ రేసులో నిలవాలంటే ఫామ్ నిరూపించుకోవాలని బీసీసీఐ మేనేజ్ మెంట్, సెలక్షన్ కమిటీ ధోనీకి స్పష్టం చేసినట్లు సమాచారం. ధోనీ రీఎంట్రీపై బీసీసీఐ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ‘దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం టీమ్ ఎంపిక చేశాం. కానీ ధోనీని పరిగణనలోకి తీసుకోలేదు. జట్టులోకి రావడం ధోనీమీదే ఆధారపడి ఉంటుంది. జట్టులో స్థానం కోసం ఎంతో మంది ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు. ఎవరు ఫామ్‌లో ఉంటే, రాణిస్తే వారికి జట్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని’ ధోనీకి పరోక్షంగా అల్టిమేటం ఇచ్చినట్లయింది.
Also Read: ప్చ్.. హర్భజన్‌కు చేదు అనుభవం
కాగా, మార్చి 29న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ ప్రాక్టీసు మొదలుపెట్టేశాడు. ప్రాక్టీస్ సెషన్‌లో బంతులకు భారీగా హిట్టింగ్ చేసిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది చూసిన ఫ్యాన్స్ ‘రావాలి ధోనీ.. కావాలి ధోనీ’ అంటూ ధోనీ కమ్ బ్యాక్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
‘అప్పుడే ఎంఎస్ ధోనీ రీఎంట్రీ.. ఇది క్లియర్’