ICC T20 World Cup 2022, IND vs PAK: టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగిన పోరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ రెండు జట్లు ఆ విధంగా తలపడ్డాయి మరి. దాయాదుల మధ్య జరిగిన పోరు వరల్డ్ కప్ ఫైనల్ ను తలపించింది. క్రికెట్ ఫ్యాన్స్ కు కావాల్సిన మజాను భారత్-పాక్ మ్యాచ్ ఇచ్చేసింది. ఈ క్రమంలో ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి అద్భుతమైన మ్యాచ్‌ను చూశాక.. ప్రపంచకప్ టోర్నీని ఇక ఆపేయొచ్చని మిచెల్ మార్ష్ కామెంట్స్ చేశాడు.
"వాస్తవానికి మనం ప్రపంచ కప్‌ను ఇక్కడే ఆపేయాలని నేను అనుకుంటున్నాను. టీ20 ప్రపంచకప్‌లో ఇంకా మూడు వారాల సమయం ఉంది. ఈలోపే క్రికెట్ ఫ్యాన్స్ కు కావాల్సిన మజా భారత్-పాక్ మ్యాచ్ ఇచ్చేసింది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు వచ్చిన అభిమానుల్లో నేను కూడా ఉండి ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నా. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నమ్మశక్యం కాని రీతిలో అద్భుతంగా ఆడాడని'' మిచెల్ మార్ష్ అన్నారు.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది టీమిండియా. పాకిస్థాన్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ చివరి బంతికి ఛేదించింది. విరాట్ కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్, పాండ్యా నిలకడైన బ్యాటింగ్ తో టీమిండియాకు విజయాన్ని అందించారు.
Also Read: Rohit Sharma-Virat Kohli: హ్యాట్సాఫ్ విరాట్ కోహ్లీ.. భారత అత్యుత్తమ నాక్‌లలో ఇది ఒకటి: రోహిత్ శర్మ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి