అరుదైన ఆల్ రౌండర్ రికార్డ్ సొంతం చేసుకున్న ఆశ్విన్

లార్డ్స్ స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో సూపర్ రికార్డు సొంతం చేసుకున్నాడు.

Last Updated : Aug 13, 2018, 12:27 AM IST
అరుదైన ఆల్ రౌండర్ రికార్డ్ సొంతం చేసుకున్న ఆశ్విన్

లార్డ్స్ స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో సూపర్ రికార్డు సొంతం చేసుకున్నాడు. విపరీతంగా వాన కురవడంతో..ఒక రోజు తర్వాత ప్రారంభమైన టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మన్ అందరూ విఫలమైనా.. అశ్విన్ ఒక్కడే 29 పరుగులు చేసి జట్టు పరువును కాపాడి...ఆ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన వ్యక్తిగా నిలిచాడు. ఈ క్రమంలోనే అరుదైన ఆల్ రౌండర్ రికార్డును కూడా తాను సొంతం చేసుకున్నాడు.

ఇప్పటి వరకూ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కేవలం చాలా తక్కువమంది భారత క్రికెటర్లు మాత్రమే బౌలర్లుగా రాణించి 500 వికెట్లు పడగొట్టడమే కాకుండా.. బ్యాట్స్‌మన్‌గానూ సత్తా చాటి 3000 పరుగులు పూర్తి చేశారు. అలాంటి క్రికెటర్లలో హర్యానా హరికేన్ కపిల్ దేవ్ తొలిస్థానంలో ఉండగా.. ఆయన తర్వాతి స్థానంలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్‌లు ఉన్నారు. ఇప్పడు ఈ జాబితాలో రవిచంద్రన్ ఆశ్విన్ కూడా చేరాడు. తద్వారా మేటి ఆల్ రౌండర్ల లిస్టులో తాను కూడా కపిల్ దేవ్ వంటి గొప్ప ప్లేయర్ల సరసన చేరాడు. 

తన కెరీర్లో ఇప్పటి వరకూ  60 టెస్టులు, 111 వన్డేలు, 46 టీ20లు ఆడాడు ఆశ్విన్. ఇటీవలే ఐపీఎల్ 2018లో పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా కూడా రవిచంద్రన్ అశ్విన్ సెలెక్ట్ అయ్యాడు. 2014లో అర్జున అవార్డు గెలుచుకున్న ఆశ్విన్.. 2016లో ఐసిసి టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ఎంపికయ్యాడు. 2017లో శ్రీలంకతో జరిగిన రెండవ టెస్టులో ఆశ్విన్ అతి తక్కువ సమయంలో 300 టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా రికార్డులకెక్కాడు. 2015లో కూడా అతి తక్కువ సమయంలో 150 వికెట్లు తీసిన తొలి భారతీయ క్రికెటర్‌గానూ ఆశ్విన్ వార్తల్లోకెక్కాడు. 

Trending News