Rohit-Kohli Cutouts: విరాట్ కోహ్లీకి పోటీగా రోహిత్ శర్మ భారీ కటౌట్.. రోహిత్ డబ్బులు పంపించాడా?

Virat Kohli vs Rohit Sharma Cutouts: Did Rohit send the money for Cutout, Kohli fans trolls Rohit fans. మొదటి టీ20 మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తున్న తిరువనంతపురంలో అభిమానులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భారీ కటౌట్‌లను ఏర్పాటు చేశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 28, 2022, 11:05 AM IST
  • భారత్ vs దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌
  • త్రివేండ్రంలో విరాట్ కోహ్లీ భారీ కటౌట్
  • రోహిత్ డబ్బులు పంపించాడా?
Rohit-Kohli Cutouts: విరాట్ కోహ్లీకి పోటీగా రోహిత్ శర్మ భారీ కటౌట్.. రోహిత్ డబ్బులు పంపించాడా?

IND vs SA 1st T20, Virat Kohli vs Rohit Sharma Cutouts: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం జరిగే మొదటి టీ20 మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తున్న తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ మైదానం వద్ద టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులు ఆయన భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గ్రీన్ ఫీల్డ్ మైదానానికి వెళ్లేదారిలో మంగళవారం ఉదయం అభిమానులు కోహ్లీ భారీ కటౌట్ పెట్టారు. ఆ కటౌట్ దాదాపుగా 100 అడుగులు ఉంటుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అయ్యాయి.

సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ కటౌట్ చూసి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫాన్స్.. గంటల వ్యవధిలోనే హిట్‌మ్యాన్ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. కోహ్లీ కటౌట్‌ను మించి రోహిత్ కటౌట్ పెట్టారు ఫాన్స్. రోహిత్ కటౌట్ 100 అడుగులు ఉంటుంది. 'ఆల్ కేరళ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అసోసియేషన్' పేరిట రోహిత్ శర్మ కటౌట్ ఏర్పాటు చేశారు. హిట్‌మ్యాన్ కటౌట్‌ను కూడా గ్రీన్ ఫీల్డ్ మైదానానికి వెళ్లే దారిలోనే ఏర్పాటు చేశారు. ఈ రెండు కటౌట్‌లు ప్రతిఒక్కరిని ఆకర్షిస్తున్నాయి. టీమిండియా ఫాన్స్ అందరికీ ఈ కటౌట్‌లు కనుల పండగలా ఉన్నాయి. 

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భారీ కటౌట్లను చూసి తిరువనంతపురంలోని క్రికెట్ ఫాన్స్ ఎంజాయ్ చేస్తుంటే.. కోహ్లీ, రోహిత్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో గొడవకు దిగుతున్నారు. మా ఆటగాడి కటౌటే బాగుందంటూ కామెంట్స్ చేసుకుంటున్నారు. 'విరాట్ కోహ్లీ కటౌట్ చూసి.. రోహిత్ శర్మ డబ్బులు పంపించాడా?' అని కొందరు కోహ్లీ అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు ' మా కటౌట్ చూసి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఓర్వలేకపోతున్నారు' అని రోహిత్ ఫాన్స్ కొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కటౌట్‌లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 

Also Read: Delhi Liquor Scam: లిక్కర్‌ స్కాంలో కీలక నేత అనుచరుడు అరెస్ట్.. తెలంగాణలో కలకలం?

Also Read: Indira Devi Unseen Photos: మీరెన్నడూ చూడని మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఫోటోలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News