Virat KStep Down from t20 Captain: టీ 20 ప్రపంచకప్ (T20 World Cup) ముందు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది వరల్డ్ కప్ తర్వాత టీమిండియా టీ 20 జట్టు కెప్టెన్ పదవి నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ తెలిపాడు. నిజానికి గత కొంత కాలంగా మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న కోహ్లీ ఆటను.. కెప్టెన్సీ టాస్క్ తన ఆటను చాలా ప్రభావితం చేస్తుంది. గత కొంత కాలంగా విరాట్ సరిగా ఆడని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది.
టెస్ట్ & వన్డే కెప్టెన్‌గా కొనసాగనున్న విరాట్
అయితే విరాట్ కోహ్లీ టెస్ట్ (Test Format) మరియు వన్డే (Oneday Foramt)జట్ల కెప్టెన్సీని కొనసాగాలాని నిర్ణయించుకున్నాడు. గత కొన్నేళ్లుగా కోహ్లీ బ్యాటింగ్ ఇది వరకట్ల ఉండటం లేదని, గత రెండు సంవత్సరాలుగా ఏ ఫార్మాట్లో కూడా సెంచరీ చేయకపోవటం వలన ఈ నిర్ణయం తీసుకున్నాడు. మూడు ఫార్మాట్లలో జట్టుకు కెప్టెన్‌గా ఉండటం.. వాటి వలన వచ్చే భారం తన పేలవమైన ఫామ్ కు కారణమని, తప్పని సరి ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
Also Read: Shocking News: వీడు చదివేదే 6వ తరగతి.. కానీ బ్యాంకు అకౌంట్లో రూ. 900 కోట్లు!
గొప్ప రికార్డులు
టీ 20 కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు ఆకట్టుకుంటాయి... 45 టీ 20 మ్యాచ్‌లలో టీమిండియాకు కోహ్లీ కెప్టెన్ గా వ్యవరించగా, ఇందులో 27 మ్యాచ్ లలో భారత్ విజయం సాధిస్తే.. 14 మ్యాచ్‌లలో భారత్ ఓడిపోయింది. మిగతా 4 మ్యాచ్ లు ఫలితాలు వెల్లడించబడనివి. తన సన్నిహితుల అభిప్రాయం తెలుసుకున్న తరువాతే టీ 20 టీమ్ కెప్టెన్సీ నుంచి వైదొలగే నిర్ణయం తీసుకున్నానని కోహ్లీ తెలిపాడు. జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి (Team India coach Ravi Shastri) మరియు రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా ఈ నిర్ణయంలో భాగస్వాములని తెలిపాడు.
కొత్త కెప్టెన్ గా రోహిత్..??
కోహ్లీ తర్వాత, టీమిండియా కొత్త కెప్టెన్ లెజెండరీ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో విరాట్ ఆడని పక్షంలో లేదా ఏదైనా కారణం వలన కోహ్లీ తప్పుకుంటే తరువాతి కెప్టెన్సీ భాద్యతలు వచించేది రోహిత్ శర్మే. వాస్తవానికి, ఐపిఎల్ (IPL) వంటి గొప్ప లీగ్‌లలో రోహిత్ శర్మ కెప్టెన్సీ అద్భుతం. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబాయి ఇండియన్స్ కి (Mumbai Indians) 5 సార్లు ఐపిఎల్ కప్ సాధించగా, RCBకి కెప్టెన్ గా ఉన్న కోహ్లీ ఒక్క సారి కూడా IPL టైటిల్ గెలవకపోవటం ఒకవంతు నిరాశే...
Also Read: SBI Good News: తక్కువ వడ్డీకే లోన్.. ఎస్‌బీఐ పండుగ ఆఫర్లు.. త్వరపడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Kohli step down from t20 captain: కోహ్లీ సంచలన నిర్ణయం.. టీ20 కెప్టెన్సీకి గుడ్ బై!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం
ఈ ఏడాది టీ 20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ తప్పుకోకున్న విరాట్
తరువాత టీ 20 ఫార్మాట్ కెప్టెన్ రోహిత్ శర్మే అని వాదనలు