వైజాగ్‌కి వచ్చినందుకు సంతోషం... బాగా ఆడండి: కోహ్లీకి చంద్రబాబు బెస్ట్ విషెస్

విశాఖపట్నంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్‌కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమాధానమిచ్చారు. 

Last Updated : Oct 24, 2018, 01:19 PM IST
వైజాగ్‌కి వచ్చినందుకు సంతోషం... బాగా ఆడండి: కోహ్లీకి చంద్రబాబు బెస్ట్ విషెస్

విశాఖపట్నంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్‌కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమాధానమిచ్చారు. అయిదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్లు ఈ రోజు విశాఖలో క్రికెట్ రెండో వన్డే ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖకు వచ్చిన కోహ్లీ, ఈ నగరంపై తనదైన శైలిలో ప్రశంసల వర్షం  కురిపించారు. "అద్భుతమైన ప్రదేశం. విశాఖకు రావడాన్ని ఎంతో ప్రేమిస్తాను" అని ట్వీట్ చేశారు. అయితే విరాట్ కోహ్లీ  ట్వీట్ పై  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.

"వైజాగ్ అనే ప్రదేశం ఈ దేశం, ప్రపంచం ప్రేమించే గమ్యస్థానం అవుతుంది. విశాఖ వన్డే సందర్భంగా విరాట్ కోహ్లీతో పాటు టీమిండియాకి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్‌  చేశారు.  టీమ్‌ఇండియాకు బాగా కలిసొచ్చిన వేదికగా విశాఖపట్నంలోని వీడిసీఐ స్టేడియంను చెప్పుకోవచ్చు. ఈ స్టేడియంలోనే ధోని తన సత్తా చాటి చరిత్రను నమోదు చేశాడు. 

కాగా..విశాఖపట్నంలోని డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో విండీస్‌తో జరగనున్న 2వ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఆడనున్న ఆటగాళ్ల జాబితాను తాజాగా బీసీసీఐ విడుదల చేసింది. గౌహతిలో మొదటి వన్డే  మ్యాచ్‌లో ఆడిన జట్టు ఆటగాళ్ల పేర్లనే ఈ వన్డే మ్యాచ్‌లోనూ పరిగణనలోకి తీసుకున్నట్టు బీసీసీఐ స్పష్టంచేసింది.

మొదటి వన్డేలో బౌలింగ్ విభాగంలో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. ఈ రోజు వన్డేలో ఆడనున్న టీమిండియా  ఆటగాళ్ల జాబితా: విరాట్ కోహ్లీ (కెప్టేన్), శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, రిశబ్ పంత్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ఉమేష్ యాదవ్, మొహమ్మద్ షమీ, సయ్యద్ ఖలీల్ అహ్మెద్.

Trending News